EPAPER

Mukesh Sahani’s Father Murder: బీహార్‌లో దారుణం.. వీఐపీ చీఫ్ ముఖేష్ సహానీ తండ్రి హత్య!

Mukesh Sahani’s Father Murder: బీహార్‌లో దారుణం.. వీఐపీ చీఫ్ ముఖేష్ సహానీ తండ్రి హత్య!

Mukesh Sahani’s Father Murdered: బీహార్‌లో దారుణం జరిగింది. వికాశీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సహానీ తండ్రి హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయన్ని అతి దారుణంగా చంపేశారు. సంచలనం రేపిన ఈ ఘటన దర్బంగాలో జరిగింది.


వికాశీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్, మాజీ మంత్రి ముఖేష్ సహాని తండ్రి జితన్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. బీహార్‌లోని దర్బంగాలోని సుపాల్‌బజార్‌ సమీపంలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం స్థానికులు ఆయన వద్దకు వచ్చారు. అప్పటికే ఆయన మంచం మీద హత్యకు గురయ్యాడు.

ఈ విషయం స్థానికులు ముఖేష్‌కు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. పదునైన ఆయుధాలతో ఆయన్ని చంపినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు.


ఘటన జరిగిన సమయంలో ముఖేష్ సహానీ ముంబైలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే ముంబై నుంచి పాట్నాకు చేరుకున్నారు. అక్కడి నుంచి దర్బంగాకు వెళ్తున్నారు. ముఖేష్ సహానీ తండ్రి జితన్ హత్యకు రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై ఆర్జేడీ నాయకులు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన నేతలు, నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు.

ALSO READ: టైటానిక్‌ షిప్ మాదిరిగా బీజేపీ, సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

ఈ ఘటనపై కేంద్రమంత్రి జితన్ మాంఝీ రియాక్ట్ అయ్యారు. నిందితులను అరెస్టు చేసి విచారణ జరిపించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ముఖేష్ సాహాని కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వీఐపీ పార్టీ ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుంది.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×