EPAPER

Ayodhya : ఈ చారిత్రక వేడుకకు సాక్ష్యమవడం సంతోషంగా ఉంది.. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ట్వీట్..

Ayodhya : రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ శుభాకాంక్షలు తెలియ జేశారు. ప్రతిష్ఠాపన వేడుకకు మార్గనిర్దేశం చేసిన గురువుల సమక్షంలో ఆయన 11 రోజుల కఠిన అనుష్ఠానం ఆచరించారని గుర్తుచేశారు. దేశ ఔన్నత్యాన్ని పునరుజ్జీవింపజేసే ఈ వేడుకకు సాక్ష్యంగా నిలవడం సంతోషంగా ఉందని ఆయన సోమవారం ‘ఎక్స్‌’లో ఓ సందేశాన్ని పోస్టు చేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్‌ఖడ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన వేడుకకు మార్గనిర్దేశం చేసిన గురువులు, సాధువులు, మహనీయుల సమక్షంలో 11 రోజుల కఠిన అనుష్ఠానంతో ఆయన పవిత్రమైన ఆచారాలను పాటించారని గుర్తు చేశారు. జనవరి 22వ తేదీ మన నాగరికత పథంలో గొప్ప రోజుగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా జీవితంలోకి జ్ఞానోదయం, శాంతి, సామరస్యం, సదాచారాన్ని తీసుకురావడానికి శ్రీరాముడి క్షమాగుణం, శౌర్యం, చిత్తశుద్ధి, వినయం, శ్రద్ధ, కరుణ అనే విలువలను పెంపొందించుకునేందుకు సంకల్పిద్దామని ధన్ ఖడ్ పిలుపునిచ్చారు.

అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోదీ ఈరోజు ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం (Ram Lalla Idol consecration) ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు ఏడు వేల మంది పాల్గొననున్నారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది.

Related News

Haryana Cashless Treatment: రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. హర్యాణాలో కొత్త పథకం!

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ లో బాంబు పేల్చిన నక్సల్స్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి, నలుగురికి గాయాలు

Parenting Tips : మీ పిల్లాడు జెంటిల్‌మెన్ కావాలంటే.. ఈ టిప్స్ చాలు..!

Sperm Count : రోజూ ఇలా చేస్తే.. మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

Mopidevi Temple : ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే.. వివాహం, సంతాన యోగం..!

Plastic Bottle : మీ చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉందా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!

Big Stories

×