EPAPER

Verdict in Minor Daughter Assault : మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. మూడు జీవిత ఖైదులు విధించిన కోర్టు

Verdict in Minor Daughter Assault : మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. మూడు జీవిత ఖైదులు విధించిన కోర్టు

Father Sentenced Three Life Terms : మైనర్ కుమార్తెపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి కేరళ కోర్టు మూడు జీవిత ఖైదులను విధించింది. అంటే 21 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. గతేడాది జులైలో నిందితుడు తన ఆరేళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆర్ రేఖ ఈ కేసులో సంచలన తీర్పు ఇచ్చారు.


సెక్షన్లు 5(I), 5(M), 5(N), పోక్సో యాక్ట్ ల కింద కేసు నమోదవ్వగా.. దానిపై విచారణ జరిపి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. ఈ తీర్పుపై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ మాట్లాడుతూ.. పిల్లల రక్షణ చట్టం (POCSO), ఐపీసీ నిబంధనల ప్రకారం లైంగిక నేరాలకు పాల్పడిన తండ్రికి వివిధ రకాల శిక్షలు విధించినట్లు తెలిపారు.

Also Read : ఢిల్లీలో తీవ్ర కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్


21 ఏళ్ల జైలు శిక్షే కాకుండా.. రూ.90 వేల జరిమానా విధించారు. అన్ని శిక్షలు ఒకేసారి అమలు అమవుతాయని, నిందితుడు ఖచ్చితంగా మూడు జీవితఖైదు శిక్షల్ని అనుభవించి తీరాల్సిందేనని ప్రాసిక్యూటర్ వివరించారు. తండ్రి అనే బంధానికే ఇలాంటి ఘటనలు మాయని మచ్చవుతాయని పేర్కొన్నారు.

తల్లి గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో.. బాధిత బాలిక తన అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటుంది. గతేడాది జులైలో మొబైల్ ఫోన్ చూపిస్తానని గదిలోకి తీసుకెళ్లిన తల్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆమె ప్రైవేట్ భాగాలలో నొప్పి కలగడంతో.. ఆమె అమ్మమ్మ తనను డాక్టర్ వద్దకు తీసుకెళ్లిందని ప్రాసిక్యూటర్ తెలిపారు. తాగి ఇంటికి వచ్చిన ప్రతీసారి అనుచితంగా ప్రవర్తించేవాడని బాధిత బాలిక సోదరి కూడా కోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని పేర్కొన్నారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నిందితుడికి మూడు జీవిత ఖైదులు విధించింది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×