EPAPER

Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్.. ఈ రూట్‌ నుంచే సర్వీసులు..!

Vande Bharat Sleeper : వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్స్ ట్రయల్‌ రన్‌ను మార్చి నెల నుంచి చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత ఏప్రిల్‌లో ఈ సర్వీస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని రైల్వే ఉన్నతాధికారులు తెలపారు.

Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్.. ఈ రూట్‌ నుంచే సర్వీసులు..!

Vande Bharat Sleeper: వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్స్ ట్రయల్‌ రన్‌ను మార్చి నెల నుంచి చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత ఏప్రిల్‌లో ఈ సర్వీస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వందేభారత్ స్లీపర్ రైలులో 16 నుంచి 20 (ఏసీ, నాన్‌-ఏసీ) కోచ్‌లు ఉంటాయి. మొదటి రైలును ఢిల్లీ-ముంబయిల మధ్య ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే వేగంగా ఈ రైళ్లు వేగంగా ప్రయాణిస్తాయి. వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వల్ల దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.


రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.ఈ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఇవి అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణికులను ప్రయాణ సమయం ఆదా అవుతుంది. తొలి దశలో పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ కోచ్‌లు వేగంగా తయారు చేస్తున్నారు.

గతంలో ఉన్న స్లీపర్ తరగతి కోచ్ ల కంటే వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. ఈ రైళ్లు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటాయని వెల్లడించారు. వందేభారత్ స్లీపర్ రైళ్లు గంటకు 200 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంటాయన్నారు. రైల్వే ప్రయాణికులకు మైరుగైనా సౌకర్యాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40వేల సాధారణ కోచ్‌లను ఆధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ల తరహాలో మారస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


Tags

Related News

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Sadhguru Isha Foundation Row: సద్గురు పై కామరాజ్ ఆరోపణలు ఎంతవరకు నిజం ?

PM Internship Scheme: ‘నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త’.. ఉద్యోగశిక్షణతోపాటు ప్రతినెల రూ.5000 ఆర్థికసాయం..

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలు మృతి

PM Modi Cabinet Committee: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. భద్రతా వ్యవహారాల భేటీలో ప్రధాని ఏమన్నారు?

Train Derailed: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Isha Foundation: ఈషా ఫౌండేషన్‌‌లో పోలీసుల సోదాలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Big Stories

×