EPAPER

Uttarakhand| ‘వాహనాల్లో డస్ట్ బిన్ తప్పనిసరిగా ఉండాలి లేకుంటే భారీ జరిమానా’.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలు!

Uttarakhand| ‘వాహనాల్లో డస్ట్ బిన్ తప్పనిసరిగా ఉండాలి లేకుంటే భారీ జరిమానా’.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలు!

Uttarakhand| రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రవేశించే ప్రతి వాహనం లో డస్ట్ బిన్ (చెత్తబుట్ట)లు తప్పనిసరిగా ఉండాలని గురువారం జూలై 25న ఆదేశాలు జారీ చేసింది. ఈ నియమాన్ని పాటించకపోతే భారీ జరిమానా లాంటి కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. రాష్ట్రంలో ప్రకృతిని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.


ఉత్తరాఖండ్ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఇటీవల పొరుగు రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఈ అడ్వైజరీ ప్రకారం.. చార్ ధామ్ తీర్థ యాత్ర కోసం ఉత్తరా ఖండ్ లో ప్రవేశించే ప్రతీ వాహనంలో డస్ట్ బిన్లు, గార్ బేజ్ బ్యాగులు తప్పని సరిగా ఉండాలి. ప్రయాణీకులు దారిపై చెత్త వేయకూడదు, ఉమ్మివేయ కూడదు.


నియమాలు పాటించపోతే భారీ జరిమానా
ఉత్తరాఖండ్ లో ప్రవేశించే ప్రతి వాహనాన్ని చెక్ చేసి, ఒకవేళ నియమాలు ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా విధించండి అని ఉత్తరా ఖండ్ చీఫ్ సెక్రటరీ రాధా రతౌరి అధికారులకు ఆదేశించారు. ట్రావెల్ ఏజెన్సీలు, డ్రైవర్లు, టూర్ ఆపరేటర్లు, ప్రజలందరికీ ఈ నియమం గురించి తెలియజేయండి అని చెప్పారు.

ఉత్తరాఖండ్ ఒక పర్యాటక రాష్ట్రం. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి స్థానికులు, పర్యాటకులు, తీర్థయాత్ర కోసం వచ్చే భక్తులు.. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి అని రాధా రతౌరి అన్నారు. గత సంవత్సరం 9 లక్షలకు పైగా భక్తులు ఛార్ ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు.

Also Read: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడిని టాయ్ లెట్‌లోకి తీసుకెళ్లిన కస్టమ్స్ అధికారి.. అక్కడ ఏం జరిగిందంటే..

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×