Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 36 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. మరో 20 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని అల్మోర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పౌరి నుండి రామ్‌నగర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఆల్మోరా స్టాల్ ప్రాంతంలోకి రాగానే అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.
ఘటన సమయంలో బస్సులో 45 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందగానే సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి పోలీసులు టీమ్, ఏస్డిఆర్ఎఫ్ బృందాలు. గాయపడినవారిని తొలుత ట్రీట్‌మెంట్ చేశారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యాయి.
బస్సు ప్రమాదంపై స్పందించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.
ALSO READ: సైన్యం వ్యూహం అదుర్స్.. బిస్కెట్లతో ఉగ్రవాది హతం
అవసరమైతే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను కోసం ఎయిర్ లిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. బస్సు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని కమిషనర్‌ని ఆదేశించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి.
#Uttarakhand के अल्मोड़ा के सल्ट में एक यात्री बस करीब 100 मीटर गहरी खाई में गिरकर दुर्घटनाग्रस्त हो गई
हादसे में 20 लोगों की मौत की पुष्टि हुई है
बस में 40 से ज्यादा लोग सवार थे
बस गोलिखाल क्षेत्र से रामनगर जा रही थी
दुर्घटनाग्रस्त GMOU की है#Almora | Almora #BusAccident pic.twitter.com/vo3dRxffPE
— Sandeep (@SandeepK7UK) November 4, 2024