BigTV English

Train : ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టీటీఈ అరెస్టు….

Train : ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టీటీఈ అరెస్టు….

Train : విమానాల్లో తరచూ జరుగుతున్న పాడు ఘటనలు .. బస్సులు, రైళ్లకు పాకాయి. తాగిన మైకంలో కొందరు ప్రయాణికులు ఒళ్లు మర్చిపోతున్నారు. సైకోలు మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఇదే తరహాలో మరో ఘటన విమానంలో జరిగింది. ఇటీవల కర్నాటకలో ఓ విద్యార్థి బస్సులో ఇలాంటి చర్యకే పాల్పడ్డాడు. తాజాగా రైలులో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే ఇక్కడ విస్తుపోయే విషయమేమిటంటే.. నిందితుడు ఓ రైల్వే అధికారి.


మద్యం మత్తులో నిందితుడు ఓ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వ్యవహారంలో రైల్వే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నిందితుడి అరెస్టు చేశారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం అమృత్‌సర్‌- కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. అర్ధరాత్రి సమయంలో రైలు లక్నోకు సమీపిస్తోంది. ఆ సమయంలో ఆ మహిళ కేకలు విని తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా మేల్కొన్నారు. ఏం జరిగిందని ఆ మహిళ వద్దకు వచ్చారు. అప్పటికే ఆమె మద్యం మత్తులో ఉన్న టికెట్‌ తనిఖీ అధికారి.. టీటీఈని చేతితో బలంగా పట్టుకుని ఉన్నారు. అతను తనపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపించారు. దీంతో రైలు లక్నోకు చేరుకున్న తర్వాత టీటీఈని రైల్వే పోలీసులకు అప్పగించారు.


నిందితుడిని బిహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. టీటీఈపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొన్న విమానం, నిన్న బస్సు , నేడు రైలు ..ఇలా ప్రయాణ సమయాల్లో మందుబాబుల వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉన్మాదులు భౌతిక దాడులకు దిగుతున్నారు. మరికొందరు మూత్ర విసర్జన చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువ మంది బాధితులు మహిళలే ఉంటున్నారు. ఇలాంటి పాడు చర్యలను ఆపేదెలా..?

Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Cybercrime: నగ్న వీడియోలతో ఉచ్చు.. డబ్బులు పంపాలంటూ వేధింపులు

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×