EPAPER

Puja Khedkar: పూజా ఖేడ్కర్‌ ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దు.. మరో సారి పరీక్ష రాయకుండా డిబార్

Puja Khedkar: పూజా ఖేడ్కర్‌ ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దు.. మరో సారి పరీక్ష రాయకుండా డిబార్

Puja Khedkar: ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌‌కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాక్ ఇచ్చింది. నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించారని తేలడంతో యూపీఎస్సీ ఆమె ఐఏఎస్ సెలక్షన్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు భవిష్యత్తులో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలో పాల్గొనకుండా డిబార్ చేసింది.


యూపీఎస్సీ కమిషన్ పూజా ఖేడ్కర్ వివాదంపై తొలిసారి స్పందించింది. యూపీఎస్సీ నిర్వహించిన విచారణలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2022లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫోటోలు, సంతకాలు, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇంటి అడ్రస్‌తో పాటు ఇతర వివరాలకు సంబంధించి అన్ని ధృవీకరణ పత్రాలు అందించినట్లు తమ విచారణలో తేలిందని యూపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఓ నోట్ విడుదల చేసింది.

ఆ నోట్‌లో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ షోకాజు నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. అంతే కాకుండా ఆమె భవిష్యత్తులో యూపీఎస్సీ పరీక్ష రాయకుండా, అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా డిబార్ చేసినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పరీక్షల్లో మోసపూరితంగా వ్యవహరించిన పూజా ఖేడ్కర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×