EPAPER

UP CM Yogi Adityanath: యూపీ సీఎం సంచలన ఆరోపణ.. ఆ పార్టీతోనే మహిళల భద్రతకు ముప్పు

UP CM Yogi Adityanath: యూపీ సీఎం సంచలన ఆరోపణ.. ఆ పార్టీతోనే మహిళల భద్రతకు ముప్పు

UP CM Yogi Adityanath: మహిళల భద్రతకు సమాజ్ వాదీ పార్టీ వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆరోపించారు. మహిళలపై దాడుల కేసుల్లో ఉన్న వారంతా సమాజ్ వాదీ నేతలేనని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులను నివారించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా అని ఎస్పీ సభ్యుడు రాగిణి సొంకర్ యూపీ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ యోగి ఆదిత్య నాథ్ ఈ ఆరోపణలు చేశారు.


మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సీరియస్‌గా ఉందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దాని ఫలితంగానే మహిళలు, బాలలపై దాడుల కేసులు నిరంతరం తగ్గుతున్నాయని తెలిపారు. నేరస్తుల మనసుల్లో భయాందోళన కలిగించాం అని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మహిళల భద్రత పట్ల పూర్తిగా అప్రమత్తంగా, చురుకుగా వ్యవహరిస్తుందని.. ప్రతి కూతురు, వ్యాపార వేత్తకూ భద్రత కల్పించేందుకు కట్టుబడి పని చేస్తుందని అన్నారు.

2017లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే తమ తొలి చర్య అని అన్నారు. యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుల వ్యతిరేకించిందే సమాజ్ వాదీ పార్టీ అని ఆరోపించారు. 2016లో ఎస్సీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయని అన్నారు.


Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×