EPAPER

Centre’s Lateral Entry U-turn: లేటరల్ ఎంట్రీపై కేంద్రం వెనకడుగు.. ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందిగా యూపీఎస్సీకి ఆదేశం

Centre’s Lateral Entry U-turn: లేటరల్ ఎంట్రీపై కేంద్రం వెనకడుగు.. ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందిగా యూపీఎస్సీకి ఆదేశం

Centre’s Lateral Entry U-turn due to criticism(Telugu news live): లేటరల్ ఎంట్రీ ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందిగా యూపీఎస్సీని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి యూపీఎస్సీ చైర్మన్‌కు డీఓపీటీ మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. అయితే, లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం వీరప్ప మొయిలీ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు లేటరల్ ఎంట్రీ విధానాన్ని తీసుకొచ్చించింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాల్సిన పదవుల్లో ఆయా రంగాల నిపుణులను నియమించారు. యూపీఏ హయాం నుంచి ఈ పథకం అమలవుతున్నది.


Also Read: కాశ్మీర్‌లో వరుస భూకంపాలు..వణికిపోయిన ప్రజలు

అయితే, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‍‌ ద్వారా పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ విధానంపై రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని, బ్యాక్ డోర్ ద్వారా నియామకాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. అంతేకాదు.. దీనిపై ప్రతిపక్షాలతోపాటు స్వపక్షంలోని పార్టీల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది.


ఈ మేరకు ప్రధాని మోదీ స్పందిస్తూ.. సామాజిక న్యాయం విషయంలో తన వైఖరిలో మార్పు లేదని, లేటరల్ ఎంట్రీ నియామకాల్లో కూడా రిజర్వేషన్ల అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఆ మేరకు ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×