EPAPER

Good News For Unemployed Youth: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే

Good News For Unemployed Youth: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే

Good News For Unemployed Youth: కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు రంగాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా యువత కోసం పలు పథకాలను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా నిరుద్యోగులను కంపెనీలతో అనుసంధానించే ప్రణాళికను బడ్జెట్‌లో ప్రధానంగా పేర్కొన్నారు. అదేవిధంగా మొదటి ఉద్యోగం పొందుతున్న వారి కోసం కూడా అనేక ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు వచ్చే ఐదేళ్లలో లక్షలాది మంది యువతకు శిక్షణ ఇచ్చే యోచనలో కేంద్రం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాలన్నిటినీ ప్రస్తావించారు.


యువతకు సంబంధించి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు ప్రస్తావించారు. సుమారుగా 20 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. దీనితోపాటు ఉపాధిని కల్పించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనున్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 3 ప్రోత్సాహక పథకాలను తీసుకురానున్నది. అంతేకాకుండా కంపెనీల సహకారంతో శ్రామికులకు హాస్టల్స్ నిర్మించనున్నారు. అయితే, సోమవారం సమర్పించిన ఆర్థిక సర్వేలో దేశంలోని యువతలో కేవలం 51.25 శాతం మంది మాత్రమే ఉపాధి నైపుణ్యం కలిగి ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మిగతా 48.75 శాతం మంది యువత ఉపాధికి నైపుణ్యం కలిగిలేరని సర్వేలో వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని 20 లక్షల యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది.

Also Read: నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరంలేదు: సుప్రీంకోర్టు


అంతేకాదు.. యువత కోసం ప్రత్యేకంగా పథకాలను కూడా ప్రకటించింది. వీటి కింద కోటి మంది యువతను ఇంటర్న్‌షిప్ పథకంతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇటర్న్‌షిప్ సమయంలో ఈ యువతుకు రూ. 6 వేల వరకు గౌరవ వేతనం లభించనున్నది. ఈ విధంగా యువతకు ఉపాధి మార్గాన్ని చూపించనున్నది.

అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుద్యోగ యువతకు రూ. 10 లక్షల వరకు రుణం ఇస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళల కోసం కూడా ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×