EPAPER

Union Budget 2024 Live Updates : కేంద్ర బడ్జెట్ 2024-25 లైవ్ అప్ డేట్స్.. కొత్త పన్ను విధానంలో మార్పులు

Union Budget 2024 Live Updates : కేంద్ర బడ్జెట్ 2024-25 లైవ్ అప్ డేట్స్.. కొత్త పన్ను విధానంలో మార్పులు

Union Budget 2024 Live Updates : లోక్ సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో 9 రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. అమరావతి అభివృద్ధికి రూ.15000 కోట్లను కేటాయించినట్లు ప్రకటించారు. అలాగే బంగారం, వెండి, ప్లాటినం పై కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించారు.


  • సింగరేణికి రూ.1600 కోట్లు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.620 కోట్లు
  • తెలంగాణ వాటా రూ.26,216 కోట్లు
  • కేంద్రపన్నుల్లో ఏపీ వాటా రూ.50,474 కోట్లు
  • టూరిస్ట్ సెంటర్ గా నలంద యూనివర్సిటీ
  • రాజ్ గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
  • రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకూ వడ్డీలేని రుణాలు
  • ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెరిగిన పన్ను శాతం
  • కొత్త పన్నువిధానం ఎంచుకున్న వారికి ఊరట
  • స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు
  • కొత్తపన్ను విధానంలో రూ.17,500 పన్ను ఆదా
  • వార్షిక ఆదాయం రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను
  • రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ 20 శాతం పన్ను
  • రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ 12 శాతం పన్ను
  • రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 10 శాతం పన్ను
  • ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ 5 శాతం పన్ను
  • వార్షిక ఆదాయం రూ.0 నుంచి రూ.3 లక్షల వరకూ పన్ను మినహాయింపు
  • కొత్త పన్నువిధానం కింద స్లాబ్ లు మార్పు
  • చిన్న ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం
  • 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు
  • TDSలో TCSను కలిపే వెసులుబాటు
  • ఈ-కామర్స్ సంస్థలకు టీడీఎస్ 0.1 శాతానికి తగ్గింపు
  • క్యాపిటల్ గెయిన్స్ పన్ను రూ.2.5 లక్షలకు పెంపు
  • అమోనియం నైట్రేట్ పై కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
  • లెదర్ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు
  • అన్ని వర్గాలకు ఏంజిల్ ట్యాక్స్ పూర్తిగా ఎత్తివేత
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ కోసం జన్ విశ్వాస్ 2 బిల్లుపై సమాలోచనలు
  • రొయ్యలు, చేపల ఫీడ్ పై BCD 5%కి తగ్గింపు
  • మొబైల్స్ పై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • సోలార్ ఉత్పత్తులపై, 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • బంగారం, వెండి పై 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
  • 2024-25 బడ్జెట్ అంచనా రూ.32.07 లక్షల కోట్లు
  • 3 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
  • మరింత సరళతరంగా FDI నిబంధనలు
  • GSTని మరింత సరళంగా, హేతుబద్ధంగా మార్చుతాం
  • GSTతో పన్నుభారం తగ్గిందన్న నిర్మలమ్మ
  • పట్టణ ప్రాంతాల్లోని భూములకు GIPSతో డిజిటలైజేషన్
  • గ్రామీణ ప్రాంతాల్లో భూముల కోసం భూ ఆధార్
  • వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్..
  • కార్మికులకు సంక్షేమం శ్రమ్ పోర్టు
  • త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
  • MSMEలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు
  • వరదలతో నష్టపోతున్న బీహార్ కు రూ.11వేల కోట్లు కేటాయింపు
  • 5 వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
  • గృహ నిర్మాణాలకు రూ.2.2 లక్షల కోట్లు.. అర్బన్ హౌసింగ్ కు ఐదేళ్లలో నిధులు
  • NTPC – BHEL సంయుక్త నిర్వహణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికై రూ.11.11 లక్షల కోట్లు
  • రానున్న ఐదేళ్లలో 5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ
  • పీఎం సూర్య ఘర్ కింద 1.8 కోట్ల రిజిస్ట్రేషన్లు
  • నాబార్డ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతి
  • మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టాంపుల డ్యూటీ తగ్గింపు
  • స్టాంపు డ్యూటీలు పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
  • కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్.. 2.1 కోట్ల మందికి లబ్ధి
  • మహిళాభివృద్ధి కోసం రూ.3 లక్షల కోట్లు
  • కొత్తగా NCLT ట్రిబ్యునల్స్ ఏర్పాటు
  • కొత్తగా 12 పారిశ్రామిక కారిడార్లు మంజూరు
  • 30 లక్షలకు పైబడిన 14 నగరాల్లో, ఈశాన్య ప్రాంతాల్లో ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంకుల విస్తరణ
  • కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం
  • MSMEల క్లస్టర్లలో కొత్తగా 24 సిడ్బీ శాఖలు
  • MSMEల అభివృద్ధికి చట్టంలో మార్పులు
  • గ్యారెంటీ, థర్డ్ పార్టీ హామీలు లేకుండా MSMEలకు రుణాలు
  • దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యకోసం రూ.10 లక్షల వరకూ రుణం
  • బహుళ అభివృద్ది ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్ కు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం
  • ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
  • ఏపీ సహా తూర్పు ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్
  • కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు
  • విశాఖ-చెన్నై- ఓర్వకల్లు – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధుల కేటాయింపు
  • తయారీరంగంలో కొత్త ఉద్యోగులకు నెల జీతం అందుతుంది
  • నెల జీతాన్ని మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది
  • సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది
  • ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత
  • సహకార రంగాన్ని సుస్థిరపరిచేందుకు నిర్మాణాత్మక విధానాల రూపకల్పన
  • కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్లమంది రైతుల డేటా సేకరణ
  • సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తాం
  • కూరగాయల సప్లయ్‌ చైన్‌ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం
  • ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి అభివృద్ధి
  • లక్షలోపు వేతనం ఉన్నవారు అర్హులు.. 210 లక్షల మంది యువతకు లబ్ధి
  • కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈపీఎఫ్ఓ అమలు
  • అమరావతి అభివృద్ధికి బహుళ సంస్థల ద్వారా నిధుల సేకరణ
  • వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తాం
  • ఏపీ విభజన హామీలకు కట్టుబడి ఉన్నాం-నిర్మల
  • ఏపీకి రూ.15 వేల కోట్ల సాయం
  • పేదలు, మహిళలు, యువతే లక్ష్యంగా పథకాలు
  • వచ్చే ఐదేళ్లలో నాలుగుకోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం
  • విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
  • బడ్జెట్ లో 9 రంగాలకు ప్రాధాన్యం
  • కొత్తగా 107 వంగడాలను ప్రవేశపెట్టాం – నిర్మల
  • నూనె గింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తికి కృషి
  • వ్యవసాయరంగంలో స్టార్టప్స్ కు ప్రోత్సాహం
  • ప్రధానమంత్రి అన్నయోజన పథకం 5 ఏళ్లు పొడిగింపు
  • నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్
  • ఉద్యోగం, స్కిల్, ఎంఎస్ఎంఈపై దృష్టి
  • వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్
  • పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి
  • ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం మరో 5 ఏళ్లు పెంపు
  • మోదీ సర్కారుకు 13వ బడ్జెట్
  • ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి నిర్మలా సీతారామన్
  • బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న రైతులు, ఉద్యోగులు
  • బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
  • రాష్ట్రపతికి బడ్జెట్ ప్రతులు అందజేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
  • ఈసారి కూడా ట్యాబ్లెట్ లోనే బడ్జెట్
  • లోక్ సభ ముందుకు బడ్జెట్ 2024-25


Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×