EPAPER

What becomes cheaper and what’s costlier?: బడ్జెట్‌ పూర్తి వివరాలు.. ఏ ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి?.. ఏవి తగ్గనున్నాయి??

What becomes cheaper and what’s costlier?: బడ్జెట్‌ పూర్తి వివరాలు.. ఏ ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి?.. ఏవి తగ్గనున్నాయి??

What becomes cheaper and what’s costlier?: కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఏ ఏ వస్తువుల ధరలు పెరిగాయి.. ఏ ఏ వస్తువుల ధరలు తగ్గాయి అనే వివరాలు తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.


అయితే, బడ్జెట్ ప్రభావం వల్ల ధరలు తగ్గే వస్తువులు ఇవే.. 3 రకాల కేన్సర్ మందులు, దిగుమతి చేసిన బంగారం, దిగుమతి చేసిన వెండి, సెల్‌ఫోన్స్, ఛార్జర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిల్స్, బొమ్మలు, ఆర్టిఫిషియల్స్ వజ్రాలు, లెదర్ గూడ్స్, సీఫుడ్, ఎక్స్‌రే ట్యూబ్‌లు, ఫిష్ ఫీడ్, రొయ్యలు, ఉక్కు, రాగి, సోలార్ సెల్స్ – ప్యానళ్ల తయారీ కోసం అవసరమైన వస్తువులు, అదేవిధంగా 25 రకాల క్రిటికల్ మినరల్స్, బ్రూడ్ స్టాక్, పాలీచేటి వార్మ్స్, ష్రింప్, మిథైలిన్ డైఫినెట్ డిస్సోసియనేట్ ఉన్నాయి.

ఇటు ధరలు పెరిగే వస్తువులను పరిశీలిస్తే.. ప్లాస్టిక్ వస్తువులు, పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లు, సిగరెట్, టెలికాం పరికరాలు, సోలార్ గ్లాస్, టిన్డ్ కాపర్ ఇంటర్ కనెక్ట్, అమ్మోనియం నైట్రేట్‌లు ఉన్నాయి.


Also Read: కేంద్ర బడ్జెట్ 2024-25 లైవ్ అప్ డేట్స్.. కొత్త పన్ను విధానంలో మార్పులు

కాగా, బడ్జెట్ మొత్తంలో పలు రంగాలన్నింటికి కలిపి రూ. 48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే స్థూలంగా బడ్జెట్ పరిణామం రూ. 48.21 కోట్లుగా ఉంది. ఇందులో మొత్తం ఆదాయాన్ని రూ. 32.07 లక్షలు కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని రూ. 28.83 లక్షల కోట్లుగా చూపించింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండొచ్చంటూ బడ్జెట్ లో బడ్జెట్ అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ. 16 లక్షల కోట్లుగా అంచనా వేసింది కేంద్రం.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×