EPAPER

Uddhav Thackeray : సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ ఠాక్రే చురకలు… అధికారంలో ఉండి మమ్మల్నే చెప్పమంటే ఎట్లా

Uddhav Thackeray : సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ ఠాక్రే చురకలు… అధికారంలో ఉండి మమ్మల్నే చెప్పమంటే ఎట్లా

Uddhav Thackeray : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా త్వరలోనే మోగనుంది. మహా వికాస్ అఘాడీ నాయకులతో కలిసి ఆదివారం ముంబయిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మహా ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. అధికార పార్టీ కూటమి మహాయుతి ముందుగా తమ సీఎం ఎవరో చెప్పాలన్నారు. ఆ తర్వాతే మహావికాస్ అఘాటీ తరుఫున తాము తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.


అధికారంలో ఉన్న మహాయుతి కూటమి అభ్యర్థిని ప్రకటించకుండా ప్రతిపక్ష కూటమి సీఎం అభ్యర్థిని ఎలా ప్రకటిస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న వారే ముందుగా తమ అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నేతల పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా ఉందని విమర్శించారు. వారంతా ద్రోహుల నాయకత్వంలో పోటీ చేయనున్నారని మండిపడ్డారు.

నేరస్థులను వదిలేస్తోంది…


ఎన్​సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రభుత్వ చర్యలపై ఉద్ధవ్ ఠాక్రే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. అరెస్టైన వారు అసలు నిందితులో కాదో తెలియట్లేదన్నారు.

మా కదలికలపై సర్కార్ నిఘా పెట్టిందన్న ఠాక్రే, అసలు నేరస్థులను వదిలేస్తోందని, ఇదేం పద్ధతని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రకటనపై ఉద్ధవ్ వ్యాఖ్యలకు ఎన్​సీపీ-ఎస్​పీ వర్గం అధినేత శరద్‌ పవార్‌ మద్ధతు ఇచ్చారు.

మహా ‘విధ్వంసం’

మహా పాలనపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహా గడ్డ మీద ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఆ మార్పు ఏమిటో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందని జోస్యం చెప్పారు.  మహాయుతి కూటమి పాలన మహారాష్ట్రను ధ్వంసం చేసిందని, కూటమి సర్కార్ నిర్ణయాలు సామాన్యులకు అడ్డంకిగా మారుతున్నాయన్నారు. మహాయుతి ప్రభుత్వం నుంచి మహా వాసులకు విముక్తి కల్పిస్తామని, ఇందుకు వారు తమకు మద్ధతు ఇస్తేనే పని పూర్తి అవుతుందన్నారు.

పవార్ పిలుపు…

మహా వికాస్ అఘాడీ కూటమి నేతలకు పవార్‌ ఓ విజ్ఞప్తి చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలనే  రిపీట్ చేయాలన్నారు. ఇక ప్రధాని మోదీపైనా ఆయన విమర్శలు సంధించారు. బంజారా వర్గానికి కాంగ్రెస్‌ సర్కార్ ఏమీ చేయలేదన్న ప్రధాని విమర్శలపై శరద్‌ పవార్‌ కౌంటర్ ఇచ్చారు. వసంతరావ్‌ నాయక్‌, బంజారా వర్గానికి చెందిన నేత మహారాష్ట్రకే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. ఇలాంటి మహా అంశాన్ని ప్రధాని ఎలా మరిచిపోతారని చురకలు అంటించారు.

also read : సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మధ్య సంధి కుదిర్చిన బాబా సిద్ధిఖ్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర

Related News

Uttarakhand: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం.. ఎందుకురా ఇలా తయ్యారయ్యారు!

PM Modi : గతిశక్తికి ప్రధాని మోదీ థాంక్స్… భారత్ భవిష్యత్ పై కీలక మార్గనిర్దేశం

Baba Siddique: సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మధ్య సంధి కుదిర్చిన బాబా సిద్ధిఖ్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర

RSS Kerala: కేరళ చరిత్రలో ఫస్ట్ టైమ్.. సీపీఎం గ్రామంలో ఆర్ఎస్ఎస్ కవాతు.. వెనుక ఏం జరుగుతోంది?

Shivsena Vs Shivsena: ‘అది డూప్లికేట్ శివసేన’-‘ఉద్ధవ్ మరో ఓవసీ’.. దసరా రోజు సీఎం, మాజీ సీఎంల మాటల యుద్ధం

IT Company Dasara gift: ఉద్యోగులకు ఆ ఐటీ కంపెనీ దసరా గిఫ్ట్, కార్లు, బైక్‌లతోపాటు..

Big Stories

×