EPAPER

Tsunami and earthquakes: సునామీ, భూకంపాల రాకను ముందే కనుగొనొచ్చు.. ఇది ఎలా సాధ్యమో తెలుసా..?

Tsunami and earthquakes: సునామీ, భూకంపాల రాకను ముందే కనుగొనొచ్చు.. ఇది ఎలా సాధ్యమో తెలుసా..?

Tsunami and earthquakes detected in advance: ప్రతి ఏటా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో సునామీ, భూకంపం కారణంగా వందలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. కొన్ని మిలియన్ల మంది వాటికి ప్రభావితుమవుతున్నారు. ఈ విపత్తుల గురించి ముందుగానే తెలుసుకుంటే, సకాలంలో విధ్వంసం నివారించవచ్చు. ఇప్పుడు ఇది మన భారతీయ శాస్త్రవేత్తల కృషితో సాధ్యమవుతుంది.


ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) దేశంలోని మొట్టమొదటి సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రిడిక్షన్ సర్వీస్ (SynOPS) ల్యాబ్‌ను సిద్ధం చేసింది. ఇది భూకంపాలు, సునామీల సూచనలను ఒక గంట ముందుగానే అందిస్తుంది. కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు.

Read More: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు


హైదరాబాద్‌లోని ఈ ల్యాబ్‌ సముద్రగర్భంలో జరిగే కదలికలపై నిఘా ఉంచుతుంది. ఈ ల్యాబ్ పూర్తిగా అధునాతన సెన్సార్‌లపై ఆధారపడి ఉంది. భూమిపై ఉన్న అన్ని సముద్రాలు, మహాసముద్రాలలో అనేక కిలోమీటర్ల లోతు వరకు సంభవించే ప్రతి కదలిక నిమిషాల్లో తెలిసిపోతుంది. అటువంటి సమాచారాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ఉన్న పరికరాల్లో SynOPS అత్యంత అధునాతన వ్యవస్థ అని తెలిపారు.

సినాప్స్ నుంచి వచ్చిన సమాచారం విపత్తు నిర్వహణ విభాగానికి పంపుతారు. ఇది NDRF, SDRF బృందాలు సకాలంలో సహాయ, రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించడానికి సహాయం చేస్తుంది. ఇప్పటి వరకు, సునామీ, తుఫాను వంటి విపత్తుల గురించి సమాచారం కోసం మన దేశం అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి సహాయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు Synops ల్యాబ్ అన్ని రకాల సమాచారాన్ని అందించనుంది.

తుఫాను సమాచారం 4 రోజుల ముందుగానే
సైక్లోన్ గురించిన సమాచారం 3 నుండి 4 రోజుల ముందుగానే Synops ల్యాబ్ ద్వారా తెలుస్తుంది. దీంతో హిందూ, పసిఫిక్ మహాసముద్రాలతోపాటు అన్ని మహాసముద్రాల సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థ చేపల కదలిక గురించి కూడా సమాచారాన్ని అందించగలదు. అంటే ఏ దిశలో ఎక్కువ చేపలు ఉంటాయో మత్స్యకారులకు చెప్పగలుగుతుంది అని అధికారులు తెలిపారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×