EPAPER

Doctor Raped: వైద్యురాలి నోరు, కళ్లు, ప్రైవేట్ పార్టుల నుంచి బ్లీడింగ్.. ఒకరు అరెస్టు

Doctor Raped: వైద్యురాలి నోరు, కళ్లు, ప్రైవేట్ పార్టుల నుంచి బ్లీడింగ్.. ఒకరు అరెస్టు

Kolkata Hospital: పశ్చిమ బెంగాల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై దారుణ హత్యాచారం జరిగింది. కోల్‌కతాలోని ప్రముఖ ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై శుక్రవారం తెల్లవారుజామున విగత జీవై కనిపించింది. ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ పార్టుల నుంచి బ్లీడింగ్ అవుతూ.. అర్ధనగ్న స్థితిలో ఆమె డెడ్ బాడీ లభించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.


కెమెరాతో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిర్వహించిన విచారణలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ శుక్రవారం నైట్ షిఫ్ట్‌ చేస్తున్నది. అదే రోజు తెల్లవారుజామున నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లోకి వెళ్లుతూ.. అరగంట తర్వాత బయటికి వస్తూ సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు. ఘటనా స్థలంలో కనిపించిన బ్లూటుత్ ముక్కతో నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు అనుమతులతో 14 రోజుల కస్టడీకి తీసుకున్నారు.

శుక్రవారం ఉదయం చెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఎమర్జెన్సీ బిల్డింగ్‌లోని సెమినార్ హాల్‌లో రక్తపు మడుగులో వైద్యురాలి మృతదేహం కనిపించింది. పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. గంటల వ్యవధిలోనే కెమెరా ఇంక్వెస్ట్ చేశారు. డెడ్ బాడీ పక్కనే ఆమె జీన్స్ ప్యాంట్, లోదుస్తులు పడి ఉన్నాయని, వైద్యురాలి రెండు కళ్ల నుంచి నోటి నుంచి, ప్రైవేట్ పార్టుల నుంచి రక్తం కారిందని ఈ విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఆమె పెదాలపై గాయాలు, పొట్ట, ఎడమ కాలు, ముఖంపై గాయాలు ఉన్నాయని వివరించారు. ఆమె గోర్లు కూడా విరిగినట్టు గుర్తించారు. ఆమె పై లైంగికదాడి జరిగినట్టు స్పష్టంగా సంకేతాలు సూచిస్తున్నాయని కోల్‌కతా కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ ధ్రువీకరించారు.


Also Read: NASA: రాత్రి, పగలుకు తేడా ఇదేనట, టెర్మినేటర్​ ఫొటోలు రిలీజ్ చేసిన నాసా..

ఈ సమాచారం బయటికి రాగానే వైద్యులంతా ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. మా ఒక్కగానొక్క కూతురు.. ప్రజలకు సేవ చేయాలని అనుకుని వైద్యురాలిగా ఎదగడానికి ఎంతో శ్రమించింది. ఇప్పుడు చూడండి.. ఎలాంటి పరిస్థితికి గురైందో.. అని తల్లి ఆర్తనాదాలు చేసింది. నా బిడ్డను చంపేశారు. నా ఒక్కగానొక్క బిడ్డను మర్డర్ చేశారు.. అంటూ ఆవేదను గురైంది.

ఆ వైద్యురాలి బ్యాచ్‌మెట్లు అంతకు ముందటి రోజు ఆమెతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘శుక్రవారం రాత్రి ఆమె నైట్ డ్యూటీలో ఉన్నది. అంతకు ముందు ఆమె ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకోవడాన్ని చూసింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఫ్రెండ్స్‌తో కలిసి తిన్నది. ఆ తర్వాత నైట్ డ్యూటీకి వెళ్లిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఇలా డెడ్ బాడై కనిపించింది’ అని కన్నీరుమున్నీరయ్యారు.

Also Read: Forda: బ్రేకింగ్ న్యూస్.. రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయనున్న డాక్టర్లు..!

తాము బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, దోషిని వెంటనే గుర్తించి ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరుతామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బాధిత కుటుంబంతో ఆమె మాట్లాడారు. తమ దర్యాప్తుపై నమ్మకం లేకుంటే సీబీఐని ఆశ్రయించొచ్చని, తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉన్నదని మరణించిన వైద్యురాలి తండ్రి చెప్పారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×