EPAPER

Gajendra Shekhawat Skydiving: స్కై డైవింగ్‌లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్, ఆహా.. ఏమి అనుభూతి..!

Gajendra Shekhawat Skydiving: స్కై డైవింగ్‌లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్, ఆహా.. ఏమి అనుభూతి..!

Gajendra Shekhawat Skydiving Video: మోదీ సర్కార్‌పై టూరిజం సెక్టార్‌పై ఫోకస్ చేసింది. ఇందులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్లాన్ చేస్తోంది. ఇండియాలో ప్రైవేటు స్కై డైవింగ్ సదుపాయాలను ప్రారంభించడం చాలా హ్యాపీగా ఉందన్నారు కేంద్ర టూరిజం మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.


జూలై 13న ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవం. ఈ సందర్భంగా హర్యానాలోని బచోడ్ గ్రామంలో ఎయిర్‌స్ట్రిప్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ తరహా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. టూరిజం నుంచి ఆ తరహా సదుపాయాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

భద్రతా ప్రమాణాలతో కూడిన స్కైడైవింగ్‌ను పర్యాటకులు ఎంజాయ్ చేస్తారన్నారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. అనంతరం కేంద్రమంత్రి 12 వేల అడుగుల ఎత్తులో నుంచి దూకి స్కైడైవింగ్ చేశారు. ఓ వ్యక్తి సాయంతో ఆయన ఈ ఫీట్ చేశారు. అద్భుతమైన అనుభవాన్ని వర్ణించలేమన్నారు కేంద్రమంత్రి. అంతకుముందు స్కై డైవింగ్ ఎలా చేయాలన్నదానిపై కొన్ని మెలుకువలను నిర్వాహకులు తెలిపారు. అనంతరం స్కై డైవింగ్ చేశారు కేంద్రమంత్రి. 56 ఏళ్ల వయసులో ఈ ఫీట్ చేశారాయన.


Also Read: యూపీలో బీజేపీ ఖేల్ ఖతం.. వచ్చే ఎన్నికల్లో అధికారం గల్లంతే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

స్కైడైవింగ్ నేర్చుకోవడానికి భారతదేశ ప్రజలు ఒకప్పుడు విదేశాలకు వెళ్లేవారు. అయితే సైన్యంలో మాత్రమే స్కైడైవింగ్ నేర్పిస్తారు. కాకపోతే అది పర్వతాల నుంచి మాత్రమే. ట్రెండ్‌కు తగ్గట్టుగా విమానం నుంచి నేర్చించే విధానాన్ని తీసుకొచ్చారు. హర్యానాలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ఇప్పటివరకు 7500 వరకు స్కైడైవింగ్ జరిగాయి. ఒక జంప్‌కు కేవలం 30 వేలు ఛార్జ్ చేస్తున్నారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×