EPAPER

Latest Survey on Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ? తాజా సర్వేలో తేలిందేంటంటే..

Latest Survey on Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ? తాజా సర్వేలో తేలిందేంటంటే..


Times Now – ETG Survey on Lok sabha elections(Politics news today India): ఉన్నఫళంగా లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో టైమ్స్ నౌ ఛానల్ – ఈటీజీ సర్వే శుక్రవారం తెలిపింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గాను ఆ పార్టీ ఒంటరిగా పోటీచేస్తే ఏకంగా 333-363 మధ్య లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాల వరకూ విజయం సాధించవచ్చని వివరించింది. అలాగే విపక్షమైన ఇండియా కూటమికి కేవలం 120 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 45 స్థానాలు రావొచ్చని పేర్కొంది.

ఇక్కడ ఇండియా కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ కు 28 నుంచి గరిష్టంగా 48 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది. అలాగే తమిళనాట డీఎంకేకు 24-28 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్ కు 10-11 సీట్లు వస్తాయని వెల్లడించింది. 42 లోక్ సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 17-21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. బీజేపీకి 20-24 సీట్లు రావొచ్చని పేర్కొంది. 7 సీట్లున్న ఢిల్లీలో ఆప్ 5-7 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది.


Read More : నమాజ్ చేస్తున్న ముస్లింలను కాలితో తన్నిన పోలీస్.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో

ఇక యూపీ విషయానికొస్తే.. ఈ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే తెలిపింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయమని సర్వే పేర్కొంది. 80 స్థానాలకు గాను ఎన్టీఏ కూటమికి 72-78 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్, సమాజ్ వాదీలతో కూడిన ఇండియా కూటమి 2-6 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీఎస్పీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావొచ్చని అభిప్రాయపడింది. గుజరాత్ లో మొత్తం 26 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వివరించారు.

బిహార్ లో 42 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ జేడీ(యూ) కూటమి 31-36 స్థానాలు సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన ఇండియా కూటమి 2-4 సీట్లకు పరిమితమవుతుందని , 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లతో కూడిన ఎన్డీఏ కూటమికి 34-38, కాంగ్రెస్, శివసేన (యూటీబీ), ఎన్సీపీ (శరద్ పవార్)లతో ఇండియా కూటమికి 9-13 స్థానాలు రావొచ్చని వివరించింది. కర్ణాటకలో ఎన్డీఏకు 22-24, కాంగ్రెస్ కు 4-6 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు టైమ్స్ నౌ సర్వే తెలిపింది.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×