EPAPER
Kirrak Couples Episode 1

Turkey, syria : టర్కీ, సిరియాలో దారుణ పరిస్థితులు.. 21 వేలు దాటిన మృతుల సంఖ్య..

Turkey, syria : టర్కీ, సిరియాలో దారుణ పరిస్థితులు.. 21 వేలు దాటిన మృతుల సంఖ్య..

Turkey, syria : వరుస భూకంపాలు టర్కీ, సిరియా దేశాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి ప్రకోపానికి వందల భవనాలు నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అందులో ఇప్పటికే చాలా మంది ప్రాణాల కోసం పోరాడి ఓడిపోయారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టర్కీ, సిరియాలో ఇప్పటికే 21 వేలమందిపైగా మృత్యువాత పడ్డారు. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది.


బాధితులపై చలి పంజా..
సోమవారం రాత్రి భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,117 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. ఇంకోవైపు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో బాధితులను చలి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ ఉష్టోగ్రతలు అమాంతంగా పడిపోయాయి. భూకంప బాధితులు వెచ్చదనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇందుకోసం పార్కుల్లోని బెంచీలను తగులబెట్టేస్తున్నారు. మరోవైపు బాధితులు ఆహారం , తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు తాత్కాలిక శిబిరాలు, స్టేడియాల్లో తలదాసుకుంటున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు..
టర్కీ, సిరియాలో సహాయ చర్యలు వేగంగా జరగడంలేదు. శిథిలాల తొలగింపు ప్రహసనంగా మారింది. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సహాయక చర్యలు నత్తనడక సాగుతున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ హతాయ్ ప్రావిన్సులో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. టర్కీలో మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. భూకంపం తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. సాయం సరిగా అందటంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందని అంటున్నారు. సహాయక చర్యల్లో లక్షా 10 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లులతో శిథిలాలను తొలగిస్తున్నారు.


భారత్ బలగాల సేవలు..
టర్కీలోని హతాయ్ ప్రావిన్సులో భారత్ సైన్యం తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఇక్కడ బాధితులకు వైద్యసేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. గాజియాంతెప్‌ ప్రాంతంలో ఆరేళ్ల పాపను ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు రక్షించాయి. కాంక్రీటు శిథిలాలను పగులగొట్టే యంత్రాలను వినియోగించడంతోపాటు శిథిలాల మధ్య ఇరుక్కుని ఉన్నవారి హృదయ స్పందనను గుర్తించగలిగే రాడార్లను సైనిక బలగాలు వాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారి రక్షించగలిగారు.

Related News

Delhi CM: ఢిల్లీ సీఎం అతిశీకి చేదు అనుభవం… తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోని పోలీసులు?

Prashant Kishore : అయ్యో… రాహుల్‌ గాంధీపై ఇవేం వ్యాఖ్యలయ్యా పీకే ?

Indian Railways: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే

Haryana Elections: హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

Udhayanidhi: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్

Viral Video: వామ్మో.. ఈ ఖడ్గమృగాన్ని చూడండి.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సడెన్‌గా…

Big Stories

×