EPAPER
Kirrak Couples Episode 1

India renamed as Bharat : ఇండియా ఇక భారత్..? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అందుకేనా..?

India renamed as Bharat : ఇండియా ఇక భారత్..? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అందుకేనా..?
Parliament special session latest news

Parliament special session latest news(Politics news today India) :

ఇండియా పేరును భారత్‌ గా మార్చేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోందనే సందేహాలు రేకెత్తుతున్నాయి. భారత్ అధ్యక్షతన జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతారు. జీ-20 సదస్సుకు వచ్చే అథితిలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ సెప్టెంబర్ 9న విందు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం పంపారు. అయితే ఈ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. దీంతో ఇండియా పేరును భారత్ గా మార్చేస్తారనే ప్రచారం జరుగుతోంది.


జీ-20 సదస్సు బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకొస్తుందని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. దేశం పేరు మార్పు కోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు.

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ కూడా దేశం పేరు మారుస్తున్నారనే వార్తలకు బలం చేకూర్చింది.”రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌ – మన నాగరికత అమృత్ ‌కాల్‌ వైపు వేగంగా అడుగులు వేస్తుండటం గర్వంగా ఉంది’’ అని హిమంత ట్వీట్ చేశారు.కేంద్రంలోని అధికార కూటమి ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (INDIA-ఇండియా)గా పెట్టుకున్నాయి. ఈ పేరు పెట్టుకోవడంపై అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత దేశం పేరును ‘భారత్‌’ అని మార్చాలనే డిమాండ్లు బీజేపీ నేతల నుంచి బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే ఇండియా పేరు మార్పుపై వార్తలు దేశ రాజకీయాల్లో హీట్ ను పెంచాయి.


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ‘ఇండియా : అది భారత్‌’ అని ఉంటుంది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం‌ వల్ల ‘భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య’ అని చదవాలని ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతున్న దాడి అని జైరాం రమేశ్‌ కేంద్రంపై మండిపడ్డారు.

Related News

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Big Stories

×