EPAPER

PM- KISAN : పీఎం కిసాన్‌ పథకం.. నిధులపెంపుపై కేంద్రం క్లారిటీ..

PM- KISAN : పీఎం కిసాన్‌ పథకం.. నిధులపెంపుపై కేంద్రం క్లారిటీ..

PM Kisan Scheme : పీఎం కిసాన్‌ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేసింది. పీఎం కిసాన్ పథకం కింద నిధుల మొత్తాన్ని పెంచుతారంటూ గత కొన్ని రోజుల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్‌లో ఆ మేరకు ప్రకటన ఉంటుందన్న ప్రచారమూ జరిగింది. కానీ అలాంటిదేమీ లేకుండానే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం ముగిసింది. తాజాగా పార్లమెంట్‌ వేదికగా పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచనేదీ లేదంటూ కేంద్రం స్పష్టతనిచ్చింది.

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం కిసాన్‌ మొత్తాన్ని ఏడాదికి రూ.8 వేలు నుంచి రూ.12 వేలకు పెంచే ఉద్దేశమేదీ లేదని ఆయన స్పష్టంచేశారు. మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదన్నారు. 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.


పీఎం-కిసాన్‌ అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. దీనిద్వారా ఏపీ నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రూ.6 వేలు రైతులకు అందిస్తున్నారు.

Tags

Related News

Isha Foundation : సద్గురుకి సుప్రీం బిగ్ రిలీఫ్‌, మద్రాసు హైకోర్టులో ఇషా ఫౌండేషన్‌పై కేసు కొట్టివేత

Pm Modi : నాలుగు నెలల్లో ఇది రెండోసారి… మళ్లీ రష్యాకు ప్రధాని మోదీ, స్వయంగా ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్

Karnataka MUDA ED Raids: కర్ణాటక సిఎంపై ఈడీ గురి.. మైసూరు ముడా ఆఫీసులో తనిఖీలు

Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?

Bihar Hooch : కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Big Stories

×