EPAPER

Prashant Kishore: ‘జీడీపీ అంటే ఏమిటో నీకే తెల్వదు.. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది’

Prashant Kishore: ‘జీడీపీ అంటే ఏమిటో నీకే తెల్వదు.. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది’

Prashant Kishore Comments: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నా కూడా పలు కీలకమైన అభివృద్ధి సూచికల్లో వెనుకబడి ఉందంటూ తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.


Also Read: కారు నడుపుతూ హెల్మెంట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు.. అది కూడా ఎంతంటే..?

‘తేజస్వీ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. కులం, మద్యం మాఫియా, దోపిడీ, నేరాల గురించి తేజస్వీ మాట్లాడితే ఏమైనా అనడానికి వీలుంటుంది. కానీ, వాటికి గురించి కాకుండా ఆయన అభివృద్ధి నమూనాల గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తున్నది. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో వాళ్లే అధికారంలో ఉన్నారు. ఇంతకు ఆయనకు జీడీపీ అంటే ఏమిటో కూడా ఇప్పటికీ తెలవదు. అటువంటి వ్యక్తి బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది’ అంటూ ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు స్విట్జర్లాండ్ లా కనిపించిన బీహార్ స్టేట్ ఇప్పుడు హీనంగా కనిపిస్తున్నదా? అంటూ ఆయన ప్రశ్నించారు. నితీశ్ కుమార్ తిరిగి మహాఘట్ బంధన్ లో చేరితే అప్పుడు మీకు మళ్లీ గొప్పగా కనిపిస్తదా అంటూ ప్రశ్నించారు. కాగా, వచ్చే ఏడాదిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులనూ బరిలోకి దించుతానంటూ ప్రశాంత్ కిశోర్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: అమిత్ షా కీలక ప్రకటన..కొత్తగా 5 జిల్లాలు

ఇదిలా ఉంటే.. తేజస్వీయాదవ్ బీహార్ అసెంబ్లీలో పలు వ్యాఖ్యలు చేశారు. ‘పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతిలో బీహార్ నెంబర్ వన్ గా ఉంది. అంతేకాదు నేరాల్లోనూ బీహార్ నెంబర్ వన్ గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలేదు. బీజేపీకి అధికార దాహం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు’ అంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు. వీటిపై ప్రశాంత్ కిశోర్ స్పందించి పై విధంగా మాట్లాడారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×