Big Stories

Tejashwi Yadav: తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. నీట్ పేపర్ లీకేజీకి కారణం ఆయనే..

Tejashwi Yadav: దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ పేపర్ లీక్ కేసులో తనను ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వి యాదవ్ వ్యక్తిగత సహాయకుడికి పరిచయం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై తేజస్వి యాదవ్ స్పందిస్తూ పేపర్ లీకేజీపై కుట్ర చేసింది సీఎం నితీష్ కుమార్ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు.

- Advertisement -

పేపర్ లీకేజీ అంశంపై ఇండియా కూటమి ఐక్యంగా ఉందని తెలిపారు. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ కేసులో తనతో పాటు, తన పీఏను ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. పేపర్ లీక్‌కు అసలు సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్‌లే అని అన్నారు. పేపర్ లీక్ ప్రధాన నిందితుడికి, తేజస్వి యాదవ్‌కు సంబంధం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Also Read: జమ్మూకాశ్మీర్ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఎప్పుడంటే..?

ఆర్జేడీ నేతలు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరితో పాటు ఉన్నాడు. ఆనంద్ పేరు ఈ కేసులో బయటకు రాగానే అతడితో ఉన్న ఫోటోలను డిప్యూటీ సీఎం డిలేట్ చేశారని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. కానీ అవన్నీ తమ వద్ద ఉన్నాయని త్వరలోనే అసలైన దోషులెవరో తెలుస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News