EPAPER

Teacher’s Day Gifts: టీచర్స్ డే కి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?.. మంచి గిఫ్ట్ ఐడియాలు ఇవిగో..

Teacher’s Day Gifts: టీచర్స్ డే కి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?.. మంచి గిఫ్ట్ ఐడియాలు ఇవిగో..

Teacher’s Day Gifts: గురువుల దినోత్సవం అంటే టీచర్స్ డే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా టీచర్స్ సెలెబ్రేషన్స్ కోసం అన్ని స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో ఈ సెలెబ్రేషన్స్ హడావుడి మొదలైపోయింది.


టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే..
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ ధర్మంలో ఒక గురువుకు ఆ ఈశ్వరుడి తరువాత స్థానం లభించింది. మనిషి పుట్టిన తరువాత అతని జీవితంలో ప్రథమ గురువు తల్లి అయితే.. ఆ మనిషి వ్యక్తిత్వాన్ని.. అతనికి ఈ ప్రపంచంలోని విజ్ఞానాన్ని బోధించే నేర్పరి టీచర్. అందుకే గురువులకు గౌరవార్థంగా ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ఒక టీచర్ రాష్ట్రపతి అయ్యారు. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఈ టీచర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది.

అయితే టీచర్స్ డేకు విద్యార్థులు కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. మీరు కూడా ఈ టీచర్స్ డేని ఒక స్వీట్ మెమోరీగా మార్చుకోవాలనుకుంటే మీ ఫేవరెట్ టీచర్ కు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి. తక్కువ బడ్జెట్ లో కూడా మంచి గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టీచర్స్ డే రోజు గిఫ్ట్స్ గా పుస్తకాలు, చాక్ లెట్, ఓ మంచి పెన్ లాంటివి ఇస్తుంటారు.


Also Read: డీప్ ఫ్రై చేసేందుకు బెస్ట్ అండ్ వరస్ట్ వంటనూనెలు ఇవే..!

టీచర్స్ డే రోజు ఇచ్చే మంచి గిఫ్ట్ ఐడియాలు ఇవే..

1. ఒక పర్సనలైజ్డ్ పెన్: ఒక హై క్వాలిటీ పెన్.. మీ ఫేవరెట్ టీచర్ పేరు లేదా ఒక మంచి సందేశాన్ని ఆ పెన్ పై లిఖించి ఇస్తే అది చూసినంత కాలం మీ స్వీట్ మెమోరీగా గుర్తుండిపోతుంది.

2. లెదర నోట్ బుక్ : ఒక మంచి నోట్స్ అండ్ ఐడియాస్ ని రాసుకునే నోట్ బుక్ కి స్టైలిష్ గా లెదర్ కవర్ తో బహుకరిస్తే చక్కటి గిఫ్ట్ అవుతుంది.

3. డెస్క్ ఆర్గనైజర్ : టీచర్ కూర్చొనే టేబుల్ పై వస్తువులను ఆర్గనైజ్ చేసే డెస్ట్ ఆర్గనైజర్ కూడా మంచి గిఫ్ట్ ఐడియానే.

4. ఒక పర్సనలైజ్డ్ కాఫీ మగ్ : ఒక మంచి కాఫీ మగ్ పై మీ అభిమాన టీచర్ పేరు లిఖించి, దానిపై ఒక మోటివేషనల్ మెసేజ్ లేదా ఒక ఫన్నీ డిజైన్ ఉండాలి. అలాంటి కాఫీ మగ్ మీ టీచర్ కు ఇవ్వండి.

5. ఇష్టపడే సబ్జెక్ట్ పుస్తకం : మీ టీచర్ బాగా ఇష్ట పడే సబ్జెక్ట్ గురించి ఒక మంచి పుస్తకం మార్కెట్లో ఏముందో పరిశీలించండి లేదా కొత్తగా ఆ సబ్జెక్ట్ పై వచ్చిన పుస్తకం కూడా ఇస్తే టీచర్ సంతోషంగా ఫీలవుతారు.

6. క్లాస్ రూమ్ పోస్టర్ : టీచర్ ఎక్కువ సమయం గడిపే ఆఫీస్ లేదా క్లాస్ రూమ్ లో పెట్టుకునేందుకు ఒక ఇన్స్‌పిరేషనల్ పోస్టర్ ఇవ్వండి.

7. టెక్ గాడ్జెట్ : వైర్ లెస్ చార్జర్, పోర్టబుల్ స్పీకర్, లేదా ఒక స్మార్ట్ డెస్క్ ల్యాంప్ కూడా మంచి గిఫ్ట్ ఐడియానే.

8. ఒక మంచి టోటె బ్యాగ్ : ఒక టోటె బ్యాగ్ పై టీచర్ పేరు లేదా ఆయన పేరులోని ఇనిషియల్స్ ముద్రించి గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది.

9. సెంటెడ్ క్యాండిల్స్ : మహిళా టీచర్లకైతే వారి ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకునేందుకు హైక్వాలిటీ సెంట్ ఉన్న క్యాండిల్స్ గిఫ్ట్ మంచి ఐడియా.

10. డెకరేషన్ మొక్క : క్లాస్ రూమ్ లో లేదా డెస్క్ పై డెకరేషన్ కోసం ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ ని గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది.

11. బ్రేస్ లెట్ లేదా నెక్ లెస్ : గిఫ్ట్ రూపంలో పురుష టీచర్ల కైతే ఒక బ్రేస్ లెట్ లేదా మహిళా టీచర్లకైతే బ్రేస్ లెట్, నెక్ లెస్ వాటిపై వారి పేర్లు ముద్రించి ఇస్తే చక్కని గిఫ్ట్ అవుతుంది.

వీటితో పాటు గిఫ్ట్ కార్డులు, ఫౌంటెయిన్ పెన్ , ఫెదర్ ఇంక్ పెన్, డిజిటల్ ఫొటో ఫ్రేమ్ లు కూడా మంచి గిఫ్ట్స్ రూపంలో ఇవ్వొచ్చు. టీచర్స్ డే సందర్భంగా ఈ గిఫ్ట్స్ మార్కెట్లో లేదా ఆన్ లైన్ షాపింగ్ లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×