EPAPER

AAP.. Congress: ఆమ్ ఆద్మీకి రాహుల్ గాంధీ షాక్.. హర్యానాలో ఎవరికి వారే యమునా తీరే

AAP.. Congress: ఆమ్ ఆద్మీకి రాహుల్ గాంధీ షాక్.. హర్యానాలో ఎవరికి వారే యమునా తీరే

Talks between AAP.. Congress for Haryana alliance fail : ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో దాదాపు బీజేపీని ఓడించినంత పని చేసిన ఇండియా కూటమి తరపున అన్నీ తానై రాహుల్ గాంధీ వ్యవహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఒక్కరే పెద్ద దిక్కుగా మారారు. అయితే ఇండియా కూటమిలో భాగంగా కేజ్రీవాల్ కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో మద్దతు ప్రకటించారు. త్వరలోనే హర్యానా రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ఆప్ పార్టీకి మంచి పట్టు ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆప్ తో పొత్తు పెట్టుకుంటుందని కొంతకాలంగా ఊహాగానాలు మొదలయ్యాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీ నేతలూ ఒక కొలిక్కి రాకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామి. అందుకే రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ పొత్తు పెట్టుకుని కలిసి పోటీచేస్తారని భావించారంతా. తమది జాతీయ పార్టీ కాబట్టి అత్యధిక స్థానాలలో హర్యానాలో పోటీచేయాలని భావిస్తోంది కాంగ్రెస్. పైగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలోనూ మెరుగైన ఫలితాలు రాబట్టింది.కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ల మధ్య ప్రస్తుతం హర్యానాలో ఎవరికివారే యమునా తీరే అన్న చందాన నడుస్తోంది..


అన్ని రాష్ట్రాలలో బలపడుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాలలో బలపడుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలే ఇందుకు నిదర్శనం. దీనితో ఆ పార్టీ నేతల్లోనూ ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి సంబంధించి ముందుగా పది స్థానాలలో పోటీచేయాలని కేజ్రీవాల్ అనుకున్నారు. అయితే ఆ పదిలో కేవలం మూడు స్థానాలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ మెలిక పెట్టింది. ఆ నిష్పత్తి ప్రకారం ఇప్పుడు 90 నియోజకవర్గాలకు గానూ 27 సీట్లు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కుతాయి. ఇందుకు కేజ్రీవాల్ ససేమిరా అనడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ప్రస్తుతం ఇరు పార్టీలు కూడా విడివిడిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో ప్రమేయం లేకుండానే కేజ్రీవాల్ 10 స్థానాలకు సంబంధించిన ఆమ్ ఆద్మీ అభ్యర్థులను ప్రకటించారు. వారం రోజుల కిందటే ఇరు పార్టీలు పొత్తులపై భేటీ అయ్యారు. ఈ ఎన్నికలలో ఇద్దరూ కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు.


నమ్మకం లేగనే..

వీరిద్దరి పొత్తుకు ఓ రెండు స్థానాల విషయంలో ఇరు పార్టీ నేతలూ పట్టుబట్టడంత్ోనే పొత్తులు ఓ కొలిక్కి రాలేదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ రెండు స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులే పోటీచేస్తారని ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పట్టుబట్టడంతో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదని అందుకే రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చెయ్యాలని భావిస్తున్నాయి. హర్యానాలో తమ పార్టీకి మంచి పట్టు ఉందని..ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులకు త్యాగం చేస్తే వాళ్లు ఒకవేళ ఓడిపోతే దాని ప్రభావం తమ పార్టీపై తప్పక పడుతందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వేర్వేరుగా పోటీ చేస్తేనే ఎవరి బలం ఏమిటో తెలుస్తుందని ఇరు పార్టీ నేతలూ భావిస్తున్నారు.

బీజేపీకి లాభమా?

వీళ్లిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే బీజేపీ లబ్దిపొందుతుందని రాజకీయ మేధావులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పొత్తుల విషయంలో కొద్దిగా ఎవరికివారు తగ్గితే బావుంటుందని అంటున్నారు.హర్యానాలో మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. హర్యానాలో గత ఎన్నికలలో బీజేపీ 40 స్థానాలను గెలుచుకుంది. పది స్థానాలను గెలుచుకున్న జేజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు ఎట్టి పరిస్థితిలో అధికారం బీజేపీకి దక్కనీయకుండా చేయాలని భావిస్తున్నాయి.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×