EPAPER

Supreme Court: వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కింపు పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ

Supreme Court: వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కింపు పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ
Supreme Court on VVPATs Cross Verification Petition
Supreme Court on VVPATs Cross Verification Petition

Supreme Court on VVPATs Cross Verification Petition: ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) స్లిప్లతో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను ఏప్రిల్ 16న విచారిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది.


VVPAT అనేది ఒక స్వతంత్ర ఓటు ధృవీకరణ వ్యవస్థ, ఇది ఓటరు తన ఓటు సరిగ్గా వేశాడో లేదో చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఇది ఓటరు చూడగలిగే పేపర్ స్లిప్‌ను రూపొందిస్తుంది. ఓట్ల లెక్కింపులో ఏదైన వివాదం వచ్చినప్పుడు ఈ స్లిప్పులను లెక్కిస్తారు. ఈ స్లిప్పులను సీల్డ్ కవర్‌లో ఉంచుతారు.

న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను వచ్చే మంగళవారం(ఏప్రిల్ 16) విచారిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) సంబంధించిన పిటిషన్లను విచారణకు స్వీకరించలేదని వచ్చే మంగళవారం పరిశీలిస్తామని తెలిపింది.


కాగా ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది.

న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అత్యవసర విచారణను కోరిన తరువాత, ఇతర విషయాలతో పాటు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే వారం విచారిస్తామని ఏప్రిల్ 3 న సుప్రీంకోర్టు తెలిపింది.

Also Read: Supreme Court: వీవీ ప్యాట్ ఓటు స్లిప్స్ లెక్కింపు.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు!

యాదృచ్ఛికంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపిక చేసిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఐదు ఈవీఎంలకు సంబంధించిన స్లిప్పులను లెక్కించే ప్రస్తుత పద్ధతికి విరుద్ధంగా, ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిగా లెక్కించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం, కేంద్రం నుంచి ప్రతిస్పందనలను కోరింది. కాగా తమ ఓటు నమోదయ్యందని VVPATల ద్వారా ధృవీకరించేలా చూసేందుకు పోల్ ప్యానెల్, కేంద్రానికి కోర్టు ఆదేశాలు జారీ చేయాలని ADR కోరింది. ఈ రెండు పిటిషన్లపై సుప్రీం కోర్టు వచ్చే మంగళవారం విచారణ చేపట్టనుంది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×