EPAPER

Supreme Court to SBI: రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించాలి.. ఎస్‌బీఐకి సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court to SBI: రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించాలి.. ఎస్‌బీఐకి సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court on electoral Bonds


Supreme Court to SBI on Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాల్సిందేనని సుప్రీకోర్టు ఎస్‌బీఐకి ఆదేశాలు జారీ చేసింది. అదనపు సమయం కావాలని ఎస్‌బీఐ తరఫున కౌన్సిల్ హరీష్ సాల్వే కోరారు. కాగా అదనపు సమయం ఇవ్వలేమని సుప్రీం కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూద్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పర్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పునిచ్చింది. కాగా ఎస్‌బీఐ బాండ్ల వివరాలు వెల్లడించడానికి జూన్ 30 వరకు సమయం కోరింది. దీన్ని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది.


గత నెల 15న సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగవిరుద్దమని వాటిని రద్దు చేసింది. బాండ్లు జారీ చేసిన ఎస్‌బీఐను మార్చి 12లోగా వెల్లడించాలని తీర్పునిచ్చింది. కాగా బాండ్ల వివరాలను వెల్లడించడానికి మరికాస్త సమయం కావాలని.. జూన్ 30 వరకు గడువు కావాలని మార్చి 4న ఎస్‌బీఐ సుప్రీం కోర్టును కోరింది. కాగా ఇవ్వాళ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు అదనపు సమయం ఇవ్వడానికి నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 12 లోగా బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఎస్‌బీఐ ఇచ్చిన వివరాలను మార్చి 15 లోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో ఉంచాలని సుప్రీం కోర్టు ఈసీఐకి ఆదేశాలిచ్చింది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×