EPAPER

Sonia Gandhi: రాజస్థాన్ రాజ్యసభ బరిలో సోనియా.. నామినేషన్ దాఖలు..

Sonia Gandhi: రాజస్థాన్ రాజ్యసభ బరిలో సోనియా.. నామినేషన్ దాఖలు..
Sonia Gandhi

Sonia Gandhi (political news telugu):


కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ చేరుకున్నారు. ఆ తర్వాత నామినేషన్ల పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

రాజస్థాన్‌ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహిస్తారు. అందులో ఒకటి కాంగ్రెస్‌కు గెలవడం ఖాయం. మాజీ పీఎం మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న రెండో నేతగా సోనియా గాంధీ చరిత్రకెక్కనున్నారు. గతంలో 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు


1998 నుంచి 2022 మధ్య దాదాపు 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇరువురు సోనియాగాంధీతో జైపూర్ వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీకి కొన్ని ఇతర రాష్ట్రాల వారు నామినేషన్ దాఖలు చేయమని కోరినప్పటికీ, ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలో ఉండాలని నిశ్చయించుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read More: బరేలీ బరిలో ప్రియాంక..? రాజ్యసభకు సోనియా..?

సోనియా గాంధీ రాజస్థాన్‌ను ఎంచుకోవడానికి, తెలంగాణ వంటి రాష్ట్రాలను ఎంచుకోకపోవడానికి పార్టీ నాయకత్వం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపించకూడదనే కారణమని వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే కర్నాటకకు చెందినవారు కావడం, రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, సోనియా గాంధీ కోసం పార్టీ ఉత్తరాదిలో ఒక రాష్ట్రంపై ఆసక్తి చూపారు.

సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కంచుకోట అని చెప్పొచ్చు. 2004 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు సోనియా గాంధీ వరుసగా రాయ్‌బరేలీలో గెలిచారు. కాగా 56 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం గత నెలలో ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఓటింగ్ జరగనుంది. 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15.

కాంగ్రెస్ బిహార్‌ నుంచి అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హండోరె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×