Big Stories

Karnataka : కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా సిద్ధూ, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణం.. మరో 8 మందికి కేబినెట్ లో చోటు..

Karnataka News Today(Latest breaking news in Telugu) : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. సిద్దూ కేబినెట్ లో మరో 8 మందికి చోటు దక్కింది. డీకే శివకుమార్ వర్గం నుంచి ఒక్కరికే అవకాశం లభించింది.

- Advertisement -

మంత్రివర్గంలో దళిత సామాజికవర్గం నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. ప్రియాంక్ ఖర్గే , మునియప్ప, పరమేశ్వరకు ఎస్సీ వర్గం నుంచి చోటు దక్కింది. క్రిస్టియన్ల నుంచి కేజే జార్జ్ , ముస్లింల నుంచి జమీర్ అహ్మద్ , గిరిజనుల నుంచి సతీష్ జోర్కోలికి మంత్రి పదవులు దక్కాయి. లింగాయత్ వర్గం నుంచి ఎంబీ పాటిల్ ఒక్కరికే అవకాశం కల్పించారు. రామలింగారెడ్డికి మంత్రి పదవి దక్కింది.

- Advertisement -

ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ వీందర్ సింగ్ హాజరయ్యారు . సీతారాం ఏచూరి, ఫారుఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, డి. రాజా, కమల్ హాసన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్, ప్రతిపక్షాల బలప్రదర్శనకు వేదికగా మారింది. ఒకే వేదికపైకి విపక్షాలు కలిసి రావడంతో 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.


- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News