EPAPER

Shatrughan sinha: దీదీకి మద్దతుగా నిలిచిన బాలీవుడ్ వెటరన్ నటుడు శతృఘ్న సిన్హా

Shatrughan sinha: దీదీకి మద్దతుగా నిలిచిన బాలీవుడ్ వెటరన్ నటుడు శతృఘ్న సిన్హా

Shatrughan sinha support to Mamatha Benergy issue of lady doctor case: డెబ్బయ్యవ దశకంలో బాలీవుడ్ టాప్ హీరోలలో ఒగరుగా ఉన్నారు శతృఘ్న సిన్హా.సీరియస్ యాక్షన్ సీన్స్ బాగా పండించడంతో బాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేవారు. విలన్ గానూ విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. గంభీరమైన ఆయన వాయిస్ ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. శతృఘ్న సిన్హా తర్వాత అమితాబ్ బచ్చన్ దీవార్ మూవీ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నారు.


బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి..

2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీహార్ లోని పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో క్యాబినెట్ మంత్రిగా చేశారు. అయితే బీజేపీతో విభేదించి 2019న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత మమతా బెనర్జీ ఆశయాలు నచ్చి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. రీసెంట్ గా జరిగిన లోక్ సభ ఎన్నికలలో అసల్సోల్ స్థానం నుండి గెలుపొందారు.
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ హత్య , అత్యాచారం కేసులో పశ్యిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉదాసీన వైఖరి అవలింబిస్తున్నారని..నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని అందరూ మమతా బెనర్జీని ట్రోల్ చేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం అవకాశం దొరికినప్పుడల్లా దీదీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తునే ఉన్నారు. ఒక మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమయిందని తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ. అయితే శతృఘ్న సిన్హా ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత మమతా బెనర్జీకి తన పూర్తి మద్దతు ప్రకటించారు.


మమతాజీకి అండగా..

మమతా బెనర్జీ సంచలనాత్మకంగా అత్యాచార నిరోధక బిల్లును తీసుకొచ్చారని..ఇది చారిత్రాత్మకం అని..దీని వలన నేరస్థులు భయపడతారని..భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి పనులు చేయడానికి వణికిపోతారని..అలాంటి సంచలనాత్మక బిల్లును చిల్లర రాజకీయాలు చేస్తూ విమర్శిస్తున్నారు కొందరు అని శతృఘ్న సిన్హా విపక్షాలపై విరుచుకుపడ్డారు. మమతాజీకి తాను అత్యంత విశ్వాసపాత్రుడుగా..ఒక సైనికుడిలా వ్యవహరిస్తానని..ఈ విషయంలో మమత తీసుకున్న నిర్ణయానికి అందరూ హర్షించాలని అన్నారు. అత్యాచార నిరోధక బిల్లును కేంద్రం ఎలాంటి రాజకీయ దురుద్దేశంలేకుండా ఆమోదించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఒక మంచి పని చేయడానికి ముందుకు వచ్చేవారిపై ఇలా రాజకీయ బురద జల్లడం భావ్యం కాదని..ప్రధాని హోదాలో ఉన్న మోదీ సైతం మమతాజీని విమర్శిస్తున్నారని..ఒక సారి విమర్శలు చేసే ముందు కథువా, హత్రాస్, మణిపూర్ వంటి సమస్యలను మోదీ ఏ రకంగా పరిష్కరించారని ప్రశ్నించారు.
కోల్ కతా వైద్యురాలి సంఘటనలో మమతా బెనర్జీ సత్వరమే స్పందించారని..అయినా కొందరు పనిగట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని..ఇటువంటివి ఉపేక్షించబోమని అన్నారు.

రాజకీయాలు మానుకోవాలి

రాజకీయాలు చేసేవారికి అన్నీ ఎదుటివారిలో తప్పలే కనిపిస్తాయని..మంచి కనబడదని అన్నారు. ఈ విషయంలో మమతా బెనర్జీకి తాను అండగా నిలబడి పోరాడతానని అన్నారు. మమతాజీని ఒంటరి చేసి విపక్షాలు అన్నీ కలిసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని..ఇకపై తాను ఉండగా అలాంటివి జరగనీయనని అన్నారు. జాతీయ స్థాయిలో మమతాజీకి మద్దతుగా నిలబడి పోరాడతానని అన్నారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×