EPAPER

Shashi Tharoor: బంగ్లాదేశ్‌లో పాక్ ఆర్మీ 1971 ఓటమి విగ్రహాలు ధ్వంసం.. ఫొటోలు షేర్ చేసిన శశిథరూర్!

Shashi Tharoor: బంగ్లాదేశ్‌లో పాక్ ఆర్మీ 1971 ఓటమి విగ్రహాలు ధ్వంసం.. ఫొటోలు షేర్ చేసిన శశిథరూర్!

Shashi Tharoor| 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఓటమి తరువాత పాకిస్తాన్ సైనికులు సరెండర్ చేశారు. అప్పుడు భారత్ సైన్యాధికారులతో పాక్ సైన్యం ఓటమి ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి ప్రతీక. ఆ దృశ్యాలు విగ్రహ రూపంలో బంగ్లాదేశ్ లో ఉన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక దాడుల్లో అల్లరి మూకలు ఆ చరిత్రాత్మక విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఆ ధ్వంసమైన విగ్రహాల ఫొటోలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ.. బాధాకరంగా పోస్టు చేశారు.


‘ముజీబ్ నగర్ లోని 1971 షహీద్ మెమోరియల్ కాంప్లెక్స్ లో ఉన్న ఆ చరిత్రాత్మక విగ్రహాలు నాశనం కావడం చూసి చాలా బాధగా అనిపించింది. బంగ్లాదేశ్ లోని భారత సాంస్కృతిక కేంద్రం, హిందరూ దేవాలయాలు, హిందువులు, మైనారీటీల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ముస్లిం సోదరులే ఈ దాడులు చేస్తున్న అల్లరి మూకలను అడ్డుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం.’ అని థరూర్ తన ట్వీట్ లో రాశారు.

1971 బంగ్లాదేశ్ యుద్ధంలో భారత సైన్యంతో కలిసి బంగ్లాదేశ్ ముక్తి బాహిని సైన్యం పోరాడింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీకి మేజర్ జెనెరల్ అమిర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ నాయకత్వం వహించారు. యుద్ధంలో ఓడిపోయిన తరువాత మేజర్ జెనెరల్ నియాజీ తన 93000 మంది సైనికులతో కలిసి సరెండర్ చేశారు. ఆ సరెండర్ కోసం అధికారికంగా పాకిస్తాన్ ఆర్మీతో భారత సైన్యాధికారి లెఫ్టెనెంట్ జెనెరల్ జగ్జీత్ సింగ్ అరోరా ‘ఇన్స్‌ట్రూమెంట్ ఆఫ్ ఆర్డర్’ సైన్ చేయించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక అతిపెద్ద సైన్య సరెండర్ ఇదే కావడం విశేషం.


Also Read: ఆలయంలో ఘోర విషాదం. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి

ప్రభుత్వ ఉద్యోగాల కోటా వివాదంపై బంగ్లాదేశ్ లో ఇటీవల మొదలైన విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ హింసలో బంగ్లాదేశ్ ఆర్మీ, ప్రతిపక్ష పార్టీల హింసకు పాల్పడే విద్యార్థులకు సాయం చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. పరిస్థితులు దిగజారడంతో ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమెను దేశం విడిచి వెళ్లేందుకు ఆర్మీ చీఫ్ 45 నిమిషాలు గడువు ఇవ్వడంతో ఆమె అక్కడి నుంచి భారత కు బయలుదేరారు. ప్రస్తుతం షేక్ హసీనాకు తాత్కాలికంగా భారత దేశంలో శరణార్థిగా ఉన్నారు.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×