EPAPER

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Boat Capsize in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి ఏడుగురు మృతి

Seven people Dead as Boat Capsizes in Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లోని విషాధ ఘటన చోటుచేసుకుంది. మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోదా గ్రామ సమీపంలోని సీప్ నదిలో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు పడవ నదిలో పడిపోయింది. పడవలో సుమారు 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మన్పూర్ ప్రాంతంలో ఈ శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా నలగురిని సురక్షితంగా రక్షించారు. మృతులలో 35 ఏళ్ల వ్యక్తి, 30 ఏళ్ల మహిళ, 4 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణం తుఫాను లేదా వర్ల్‌పూల్ పడవను కూల్చివేసి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

Also Read: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..


ప్రమాద వార్త తెలియగానే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇక్కడ కూడా పాలనా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. అంబులెన్స్ కూడా సమయానికి సంఘటనా స్థలానికి చేరుకోలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, సాయంత్రం 6 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని గ్రామస్తులు తెలిపారు.

Related News

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Big Stories

×