EPAPER

Rare Rat : ఆ ఎలుక దెబ్బకు టెంకాయ బద్దలు!

Rare Rat : ఆ ఎలుక దెబ్బకు టెంకాయ బద్దలు!

Rare Rat : కొబ్బరికాయను సైతం ఆ అరుదైన భారీ ఎలుక పగలగొట్టేసి తినేయగలదు. దాని పదునైన పళ్ల ముందు దృఢమైన ఆ టెంకాయ కూడా తలొంచాల్సిందే. అంతరించిపోతున్న దశలో ఉన్న ఆ ఎలుక సోలమన్ దీవుల్లో తొలిసారిగా కెమెరాకు చిక్కింది. ఆ భారీ మూషికాన్ని వాంగును లేదా ఉరోమిస్ వికా అని వ్యవహరిస్తారు.


ఒక్కో ఎలుక బరువు కిలో వరకు ఉంటుంది. దాదాపు అడుగున్నర పొడవు పెరుగుతాయి. సాధారణ మూషికాలతో పోలిస్తే నాలుగింతలు పెద్దవిగా ఉంటాయి. పొడవైన తోక, చిన్న చెవులు ఈ ఎలుకకు ప్రత్యేకం. 2017లో సోలమన్ దీవుల్లో చనిపోయిన వాంగును ర్యాట్‌‌ను చూసిన శాస్త్రవేత్తల్లో ఆసక్తి మొదలైంది. అప్పటి నుంచి దానికోసం అన్వేషణ మొదలైంది.

స్థానిక జైరా తెగకు చెందిన వారు తామీ ఎలుకను ఎన్నో ఏళ్ల క్రితం చూశామని చెబుతున్నా.. అందుకు తగ్గ ఆధారాలు శాస్త్రవేత్తలకు లభ్యం కాలేదు. చివరకు వారి సాయంతోనే కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు అవి కెమెరా కళ్లకు చిక్కాయి. అయితే అడవులు, చెట్ల నరికివేత కారణంగా వాంగును ఎలుకలు అంతరించిపోయే దశకు చేరాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×