EPAPER

Savitri jindal: దేశంలోనే అత్యధిక ధనిక మహిళ.. హర్యానా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు

Savitri jindal: దేశంలోనే అత్యధిక ధనిక మహిళ.. హర్యానా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు

Savitri jindal contests Haryana polls as independent: దేశంలోనే ఆమె అత్యంత ధనవంతురాలైన ఎమ్మెల్యే అభ్యర్థి. రీసెంట్ గా హర్యానా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీకి దిగుతున్నారు. ఆమె ఎవరో కాదు సావిత్రి జిందాల్. ప్రస్తుత కురక్షేత్ర నగర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి. గతంలో సావిత్రి జిందాల్ 2005, 2009 ఎన్నికలలోహిసార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2013లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కుమారుడు నవీన్ జిందాల్ కు బీజేపీ తరపున ప్రచారం చేశారు. గత ఎన్నికలలో. ప్రపంచ అత్యంత  శ్రీమంతురాలిగా ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా జాబితాలో దేశంలోనే అత్యంత సంపన్నరాలుగా చోటు సంపాదించుకున్నారు. ఆమె సంపద 29.1 బిలియన్ డాలర్లు. భారత కుబేరుల్లో 5వ స్థానంలో నిలిచారు.


బీజేపీ నిరాకరించడం వలనే..

బీజేపీ అధిష్టానం ఆమెకు తమ పార్టీ తరపున అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వలేదు. దీనితో సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్ గా పోటీచేస్తున్నారు. దివంగత పారిశ్రామిక వేత్త ఓపీ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్. అయితే హిసార్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపై పోటీకి దిగుతున్నారు ఆమె. ‘నా భర్త కు ఈ నియోజకవర్గం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హిసార్  ప్రజలు ఎప్పుడూ నా కుటుంబ సభ్యులే. జిందాల్ కుటుంబం మొత్తం హిసార్ ప్రజలకు రుణపడి ఉంటుంది. ఎప్పటికీ ప్రజలలోనే ఉంటూ..వారితో మమేకమవుతూ వారి సేవలలోనే నిరంతరం ఉంటా’ అని అంటున్నారు సావిత్రి జిందాల్. తాను ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే పనిచేస్తానని అన్నారు.


పార్టీ అవసరమే లేదు

పనిచేయడానికి పార్టీలే అవసరం లేదని నిరూపిస్తానని అంటున్నారామె. హిసార్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కమల్ గుప్తాని బరిలోకి దింపింది. అయితే సొంత పార్టీనుంచి బయటకు వచ్చిన సావిత్రి అందుకు సమాధానం ఇస్తూ తాను బీజేపీ సభ్యత్వం ఏనాడూ తీసుకోలేదని..తన కొడుకు కోసమే నియోజకవర్గం అంతటా గతంలో ప్రచారం చేయడం జరిగిందని..కొందరు తాను కూడా బీజేపీ పార్టీకి చెందినవారిగా పొరబడుతున్నారని..తనకు ఏ పార్టీపై నమ్మకం లేకనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నానని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని అనుకున్నప్పుడు ఏ పార్టీ అవసరం కూడా ఉండదని ఆమె అంటున్నారు. పైగా స్వతంత్ర అభ్యర్థిగా ఎవరి ఒత్తిడి తనపై ఉండదని..పార్టీ తరపున పోటీ చేస్తే వారి ఒత్తిడి మేరకు పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారామె.

అక్టోబర్ 5న ఎన్నికలు

హర్యానాలో అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగనుంది. అదే నెల 8న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. సావిత్రి జిందాల్ కుటుంబానికి వ్యక్తిగతంగా అక్కడ బాగానే  పలుకుబడి, మద్దతు ఉంది. దీనితో ఆమె గెలుపు తథ్యమని అక్కడ పందాలు కాస్తున్నారు. గత గురువారమే ఎన్నికల నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో గురువారం హర్యానా లోని హిస్సార్ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు సావిత్రి జిందాల్. భర్త ఓపీ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో దివంగతులయ్యారు. దీనితో 2005లో జరిగిన ఉప ఎన్నికలో సావిత్రి జిందాల్ పోటీ చేసి గెలుపొందారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×