EPAPER

Subrata Roy : సహారా గ్రూప్ ఛైర్మన్ ఇకలేరు.. సుబ్రతా రాయ్ గురించి ఆసక్తికర విషయాలివే..?

Subrata Roy :  సహారా గ్రూప్ ఛైర్మన్ ఇకలేరు.. సుబ్రతా రాయ్ గురించి ఆసక్తికర విషయాలివే..?

Subrata Roy : సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ ఇకలేరు. 75 ఏళ్ల వయస్సులో ఆయన తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ కారణంతో మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. సుబ్రతా రాయ్ మెటాస్టాటిక్ మాలిగ్నన్సీ, హైపర్ టెన్షన్ , డయాబెటిస్‌తో వచ్చిన ఇబ్బందులతో దీర్ఘకాలికంగా పోరాటం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరణించారని సహారా గ్రూప్ తెలిపింది. ఆయనను స్ఫూర్తిదాయక నాయకుడు, దార్శనికుడిగా పేర్కొంది.


సుబ్రతా రాయ్ సహారా 1948 జూన్ 10న బిహార్ లోని అరారియా జిల్లాలో జన్మించారు. కోల్‌కతాలోని హోలీ చైల్డ్ స్కూల్‌లో ప్రాథమిక విద్యగా సాగింది. గోరఖ్‌పూర్‌ ప్రభుత్వ సాంకేతిక సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. తన వ్యాపారాన్ని 1978లో గోరఖ్‌పూర్ నుంచే మొదలుపెట్టారు. సుబ్రతా రాయ్.. విస్తృత వ్యాపార సామ్రాజ్యంగా సహారా గ్రూప్ ను అభివృద్ధి చేశారు.

సుబ్రతా రాయ్ గురించి తెలుసుకోవలసిన విషయాలు..
2012లో ఇండియా టుడే మ్యాగజైన్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా పేర్కొంది.
2004లో టైమ్ మ్యాగజైన్ సహారా గ్రూప్‌ను 1.2 మిలియన్ల కార్మికుల శక్తితో దేశంలో రెండో అతిపెద్ద సంస్థగా పేర్కొంది. సుబ్రతా రాయ్ రిటైల్, రియల్ ఎస్టేట్, ఆర్థిక, సేవా రంగాలలో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.
2011లో సహారా కంపెనీలు సెబీతో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాయి.


2012లో సుబ్రతా రాయ్‌కు చెందిన రెండు సంస్థలు పెట్టుబడిదారులకు 15 శాతం వడ్డీతో అంటే రూ.24,000 కోట్లు తిరిగి చెల్లించాలని సెబీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
2014లో సెబీ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో సుబ్రతా రాయ్‌ను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత సుబ్రతా రాయ్‌కు బెయిల్ మంజూరైంది.
2014 మార్చిలో సుప్రీంకోర్టుకు తీసుకువచ్చినప్పుడు గ్వాలియర్‌కు చెందిన ఒక వ్యక్తి సుబ్రతా రాయ్‌పై సిరా విసిరాడు. సుబ్రతా రాయ్ మాజీ ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ జట్టుకు సహ యజమానిగానూ వ్యవహరించారు.

Tags

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×