EPAPER

RPF Constable Recruitment 2024: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ.. 4660 పోస్టులపై రిక్రూట్‌మెంట్

RPF Constable Recruitment 2024: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ.. 4660 పోస్టులపై రిక్రూట్‌మెంట్

RPF Constable Recruitment 2024


RPF Constable Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4206 కానిస్టేబుల్స్, 452 సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్‌పీ‌ఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2024, ఆర్‌పీ‌ఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) నోటిఫికేషన్‌లను 26 ఫిబ్రవరి 2024న విడుదల చేసింది.

అర్హులైన అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్నా, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆర్ పీ ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ భారతి 2024 ముఖ్యమైన వివరాలు

సంస్థ                                      :    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)
ఖాళీ                                       :   పేరు కనిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్
ఖాళీల సంఖ్య                           :    4660
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ         :    26 ఫిబ్రవరి 2024
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ     :    15 ఏప్రిల్ 2024
దరఖాస్తు చివరి తేదీ                   :     14 మే 2024

రైల్వే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ క్రింది పట్టికలోని పోస్టుల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారాం.

హోదా                        పోస్ట్‌ల  సంఖ్య
కానిస్టేబుల్                     4206
సబ్ ఇన్ స్వెక్టర్               452
మొత్తం పోస్ట్‌లు                4660

ఆర్‌పీ‌ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ భారతి 2024 అర్హత

కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి రైల్వే పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థుల వయస్సు కూడా 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలిని తెలిపింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అవసరాన్ని బట్టి వయో సడలింపు ఇవ్వబడుతుంది.

ఆర్‌పీ‌ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ భారతి 2024 జీతం

రైల్వే పోలీస్‌లో ఎంపికైన తర్వాత, అభ్యర్థులకు ఆర్‌పీ‌ఎఫ్ కానిస్టేబుల్‌ల పోస్ట్ కోసం రూ. 21700/- ఇవ్వబడుతుంది. ఇది లెవల్-3 CPC పే మ్యాట్రిక్స్ ఉద్యోగం. ఆర్ పీ ఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI), జీతం రూ. 35400/-. ఇది లెవల్-6 పే మ్యాట్రిక్స్ ఉద్యోగం.

ఆర్‌పీ‌ఎఫ్ కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

స్టేజ్-1: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) రాత పరీక్ష

స్టేజ్-2: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT). (CBT) స్కోర్ ఆధారంగా, PET/PST కోసం ఖాళీల సంఖ్య కంటే 10 రెట్లు ఎక్కువ మంది అభ్యర్థులు పిలవబడుతారు.

స్టేజ్- 3: డాక్యుమెంట్ వెరిఫికేషన్

స్టేజ్-4: వైద్య పరీక్ష

Tags

Related News

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Big Stories

×