EPAPER

Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఏముందంటే..? కుక్కకు కూడా..

Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఏముందంటే..? కుక్కకు కూడా..

రతన్ టాటాకు ఉన్న 10 వేల కోట్ల ఆస్తులు.. తన పెంపుడు కుక్క టిటోతో పాటు తన వ్యక్తిగత సహాయకుడు, వంటమనిషి, డ్రైవర్‌తో పాటు ఆయన సోదరుడు జిమ్మీ టాటా, స‌వ‌తి సోద‌రి షిరీన్‌, డియ‌న్నా జిజోబీ, ఇంటి సిబ్బంది, ఇతరులతో పాటు ఆయన నెలకొల్పిన ఎండోమెంట్ ఫౌండేషన్‌కు చెందుతాయని వీలునామాలో రాశారు. రతన్ టాటాకు మూగజీవాలు, కుక్కలంటే ఎంత ప్రేమో అందరికీ తెలుసు. వీధి కుక్కల సంరక్షణ కోసం ఆయన ఆస్పత్రులను కూడా నిర్మించారు.  చివరిసారిగా ఆయన పని చేసిన ప్రాజెక్ట్‌ కూడా శునకాలకు సంబంధించినదే! ముంబైలో.. ఐదంతస్తుల భవనంలో పెట్ ప్రాజెక్ట్ పేరిట దీన్ని ప్రారంభించారు. దీనిలో.. 200 కుక్కలు ఉండేందుకు సౌకర్యాలు కల్పించారు.


ర‌త‌న్ టాటా ఆస్తుల్లో.. అలీబాగ్‌లో ఉన్న రెండు వేల చ‌ద‌ర‌పు అడుగుల భవనం, ముంబైలోని జూహూ తారా రోడ్డులో రెండు అంత‌స్తుల బిల్డింగ్‌ ఉన్నాయి. అలాగే.. రూ.350 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా స‌న్స్‌లో 0.83 శాతం షేర్లు ఉన్నాయి. వీలునామా ప్రకారం.. టాటా సన్స్‌లో ఉన్న షేర్లు.. టాటా ఫౌండేషన్‌కు బదిలీ చేస్తారు. అదేవిధంగా టాటా గ్రూప్, టాటా మోటార్స్‌లో ఉన్న షేర్లు కూడా ర‌త‌న్ టాటా ఎండోమెంట్ ఫౌండేష‌న్‌కు వెళ్తాయి. వివిధ స్టార్టప్స్‌లో రతన్ టాటాకు ఉన్న షేర్లను నగదుగా మార్చి.. ఆ మొత్తాన్ని ఫౌండేషన్‌కు బదిలీ చేస్తారు. ఇక.. రతన్ టాటాకు చెందిన దాదాపు 30 కార్లకు సంబంధించి.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Also Read: రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరు?..అసలు, టాటా విల్లులో ఏముంది…?

వాటిని.. టాటా గ్రూపే స్వాధీనం చేసుకోవాలా? పుణె మ్యూజియంలో ప్రదర్శించేందుకు తరలించాలా? వేలం వేయాలా? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఇక.. రతన్ టాటాకు వచ్చిన అవార్డులను.. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్‌లో ప్రదర్శించనున్నారు. వంద బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన రతన్ టాటా.. ఏనాడూ అత్యంత సంపన్నుల జాబితాలో కనిపించలేదు. చివరిదాకా ఆయన నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఇప్పడు.. తన వీలునామాలో రాసిన అంశాలు, తన పెంపుడు కుక్కకు, తన దగ్గర పనిచేసిన వాళ్లకు రతన్ టాటా ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవాన్ని చూస్తే.. ఆయన మహోన్నతమైన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మరోసారి అర్థమైంది.

Related News

Teachers In Obscene Act: క్లాస్‌రూమ్‌లో టీచర్లు అలాంటి పాడుపని.. విద్యార్థులు రావడంతో..

Anmol Bishnoi Most Wanted: అన్మోల్ బిష్ణోయి తలపై రూ.10 లక్షల బహుమానం.. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో పేరు

Baba Siddique Son: అజిత్ పవార్ పార్టీలో చేరిన బాబా సిద్దిఖ్ కుమారుడు.. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి రెడీ’

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Big Stories

×