EPAPER

Ratan Tata Passed Away: విలువలు తెలిసిన గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సంతాపం

Ratan Tata Passed Away: విలువలు తెలిసిన గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సంతాపం

ప్రముఖ వాణిజ్య దిగ్గజం.. రతన్ టాటా (Ratan Tata) బుధవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం యావత్ భారతావనిని ఉలిక్కిపాటుకు గురిచేసింది. వాణిజ్యంలో ఎన్నో విలువలు పాటిస్తూ.. నమ్మకానికి మారుపేరుగా గొప్ప వాణిజ్యవేత్త రతన్ టాటా. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టాటా కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ (X) వేదికగా రతన్ టాటాకు నివాళులు అర్పించారు.


రతన్ టాటా.. అసాధారణ వ్యక్తి: మోదీ

రతన్ టాటా మరణవార్త వినగానే ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘‘రతన్ టాటా.. దూరదృష్టి గల వ్యాపారవేత్త. అసాధారణమైన వ్యక్తి. ఆయన ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఆయన ఎంతో వినయం, దయతో మెలిగేవారు. సమాజాన్ని మెరుగుపరచాలనే నిబద్ధతతో పనిచేయడం వల్ల ఆయన్ని ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు’’ అని మోదీ అన్నారు.


‘‘పెద్ద కలలు కనడం.. తాను సంపాదించింది సమాజానికి తిరిగి ఇవ్వడం. ఇవే రతన్ టాటాలోని ప్రత్యేక అంశాలు. అది ఆయన అభిరుచి కూడా. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, జంతు సంరక్షణ వంటి సామాజిక సేవలను అందించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. రతన్ టాటాతో జరిపిన ఎన్నో చర్చలు మనసులో నిండిపోయాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో ఆయనను తరచుగా కలిసేవాడిని. విభిన్న సమస్యలపై మేమిద్దరం అభిప్రాయాలను పంచుకొనేవాళ్లం. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయనతో చర్చలు నడిచాయి. రతన్ టాటా మరణ వార్త నన్ను చాలా బాధించింది. ఆయన కుటుంబికులు, స్నేహితులు, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.

Also Read: వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇకలేరు.. దేశం దిగ్భ్రాంతి

రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ సైతం రతన్ మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి. వ్యాపారం, సామాజిక సేవ.. రెండింటిలోనూ ఆయన శాశ్వతమైన ముద్ర వేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని పేర్కొన్నారు.

రతన్ టాటా వయస్సు ప్రస్తుతం 86 ఏళ్లు. గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సాధారణ చెక్ అప్స్ కోసమే హాస్పిటల్‌కు వచ్చానని సోమవారం వెల్లడించారు. అయితే, మంగళవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన్ను ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స అందించారు. అర్థరాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. టాటా గ్రూప్ సంస్థ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

Related News

Ratan Tata Love Story: లైఫ్‌లో సూపర్ సక్సెస్.. లవ్‌లో మాత్రం? కన్నీళ్లు పెట్టించే టాటా ప్రేమకథ, అందుకే పెళ్లికి దూరం!

Ratan Tata: వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇకలేరు.. దేశం దిగ్భ్రాంతి

Sanjay Raut: హర్యానాలో ఓటమికి కాంగ్రెస్‌దే బాధ్యత.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

CM’s Residence: సీఎం ఇంట్లో సామాన్లు బయటకు విసిరేసిన అధికారులు? మరీ ఇంత దారుణమా!

Ratan Tata: బ్రేకింగ్ న్యూస్.. రతన్ టాటా ఆరోగ్యం విషమం?

Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..

Big Stories

×