EPAPER

Raksha Bandhan 2024 Quotes: రాఖీ పూర్ణిమ వేళ.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..

Raksha Bandhan 2024 Quotes: రాఖీ పూర్ణిమ వేళ.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..

Raksha Bandhan 2024 Quotes: ఆగష్టునెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఏరోజు వచ్చిందా అని కేలండర్ తిరగేస్తారు. రక్త సంబంధం ఉన్నా.. లేకున్న అక్కా తమ్ముళ్లుగా బంధాలని పంచీ పెంచే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ ఇది. నువ్వే నాకు రక్ష.. ఎల్లలి ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతలు, నేను కలకాలం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరి.. తన సోదరుడి రక్త సంబంధాన్ని రక్షాబంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. ఇలా సహోదర భావంతో మెలుగుతూ నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష అంటూ రాఖీ కట్టుకునే పర్వదినం నాడు. మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పేయండి.


ఆదరాభిమానాలను చూపిన నా అన్న దమ్ములకు, అక్క చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

అన్న క్షేమాన్ని కోరుతూ చెల్లెలు పడే తపన.. చెల్లికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండి భరోసా ఇవ్వాలని అన్న పడే ఆరాటం. వీటికన్నా స్వచ్చమైన ప్రేమ. ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా రాదు కదా.. అలాంటి అన్నా చెల్లెల అనుబంధానికి ప్రేమతో రక్షాబంధన్ శుభాకాంక్షలు.


అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం. అన్నా చెల్లెల్ల బంధం.

ఒక్క తల్లి బిడ్డలం కాకపోయిన .. అంత కంటే ఎక్కువ అనురాగాన్ని పంచిన ప్రియ సోదరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు.

చిగురాకు వర్ణంలో.. చిరుకోయిల సంగీతంలా.. సుప్రభాత గీతికలో .. సుమ పరిమళ పల్లవిలా.. వసంతమై నవ్వుకోవమ్మా.. ! చిన్నారి చెల్లెమ్మా.. ప్రియమైన అక్కచెల్లెల్లు, అన్నా తమ్ములకు రక్షాబంధన్ శుభాకాంక్షలు.

అన్నయ్యా.. చిరునవ్వుకి చిరునామానివి.. మంచి మనసుకు మారు రూపానివి.. మమతలకు ప్రాకారానివి.. అప్యాయతకు నిలువెత్తు రూపానివి!!! రక్షాబంధన్ శుభాకాంక్షలు.

Also Read: రాఖీ పౌర్ణమి రోజు అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారి కష్టాలు తొలగిపోయే టైమ్ వచ్చేసింది.

వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను, గుర్తు చేసే మధుర బంధమే రక్షాబందన్..

తొలిపొద్దు వెలుగులో చిగురాకుతో ముచ్చట్లు చెప్పే మంచు బిందువు అంత అందమైన అనుబంధం రాఖీ..

అన్నంటే అమ్మలో మొదటి సగం.. నాన్నలో రెండవ సగం.. అన్నా చెల్లెల్ల అనురాగానికి గుర్తే రక్షాబంధన్.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.

రాఖీ పండుగ సందర్బంగా ఈ విషేస్, కోట్స్, వాట్సాప్, షేర్ చాట్, ఫేస్ బుక్ వాటి ద్వారా మీ ప్రియమైన వారికి పంపుకోండి.

 

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×