EPAPER

Railway fines Police: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే పోలీసులు.. అడిగితే అధికారులకు బెదిరింపులు

Railway fines Police: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే పోలీసులు.. అడిగితే అధికారులకు బెదిరింపులు

Railway fines Police| సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసేవారు ఫైన్ కట్టాల్సి వస్తుంది. కానీ కొందరు ప్రభుత్వ అధికారులు రైల్వే శాఖ తమ సొంతమైనట్లు ఫీలైపోతుంటారు. టికెట్ కొనుగోలు తమకు వర్తించదని భావిస్తూ యధేచ్ఛగా ట్రైన్ లో ఫ్రీగా ప్రయాణం చేస్తుంటారు. అది కూడా ఏసీ బోగీల్లోనే దర్జాగా వెళ్లి సీటు ఆక్రమించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా.. రైల్వే నియమాల ప్రకారం దీనికి అనుమతి లేదు.


గత 45 రోజుల్లోనే ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ రైల్వ డివిజన్ లోనే టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 400 మంది పోలీసు అధికారులను రైల్వే టికెట్ చెకింగ్ స్క్వాడ్ పట్టుకుంది. వీరంతా వివిధ ఎక్స్‌ప్రెస్, మెయిల్ ట్రైన్స్ లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు రైల్వే శాఖ ఫైన్ విధించింది. ఈ ఫైన్లన్నీ ఎక్కువగా ఘాజియాబాద్, కాన్పూర్ ప్రాంతాల మధ్య విధించారు.

రైల్వే స్క్వాడ్ గత రెండు నెలలుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా స్క్వాడ్ అధికారులు.. టికెట్ లేకుండా ప్రయాణించే చాలామంది పోలీస్ సిబ్బందిని పట్టుకున్నారు. వీరంతా ఏసీ బోగీలు, ప్యాట్రీ కార్ లలో ఉచితంగా ప్రయాణం చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిసింది.


Also Read:  4 భార్యలు, 2 గర్ల్‌ఫ్రెండ్స్, 10 మంది పిల్లలు.. భార్యల సంపాదనపై బతుకుతున్నాడు!

అధికార దుర్వినియోగం చేస్తున్న పోలీసులు
ఉత్తర్ సెంట్రల్ రైల్వే(ఎన్‌సిఆర్ జోన్) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశికాంత్ త్రిపాఠి మాట్లాడుతూ.. “భారతీయ రైల్వే శాఖ రెగులర్ గా ఇలాంటి చెకింగ్ డ్రైవ్స్ చేపడుతూ ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించే వారు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో పాటు రైల్వే శాఖకు నష్టం కూడా చేకూరుస్తున్నారు. అందుకే కఠినంగా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.” అని అన్నారు.

ఎన్‌సిఆర్ జోన్ రైల్వే టికెట్ చెకింగ్ స్టాఫ్ జోనల్ సెక్రటరీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. చాలా మంది పోలీస్ సిబ్బంది, అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏసీ కోచ్ లలో ప్రవేశించి సీట్లు ఆక్రమించుకుంటారు. ప్రయాణికులు ఆ సీటు తమదేనని.. ఖాళీ చేయాలని అడిగితే.. ఖాళీ చేయకుండా బెదిరిస్తారు. ప్రయాణికులు ఫిర్యాదు చేయగా.. తాము వారితో మాట్లాడితే రైల్వే సిబ్బందిని కూడా బెదిరిస్తారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రైల్వే అధికారులను ప్రయాణికులు ఇలా చెకింగ్ చేపట్టినందుకు ప్రశంసిస్తున్నారు” అని అన్నారు.

పోలీసు సిబ్బందికి ట్రైన్లలో టికెట్ లేకుండా ప్రయాణించే అనుమతి లేదని.. ఇలాంటి చర్యలకు పోలీసు సిబ్బంది పాల్పడ కూడదని ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చినా పోలీసు సిబ్బందిలో కొంతమంది ఈ ఆదేశాలను పాటించడం లేదు. టికెట్ లేకుండా ప్రయాణించే సమయంలో చెకింగ్ స్క్వాడ్ వారికి ఫైన్ విధిస్తే.. వారిని భవిష్యత్తులో వేధిస్తామని ఆ పోలీస్ అధికారులు బెదిరిస్తున్నట్లు తెలిసింది.

ఒక టికెట్ చెకింగ్ ఆఫీసర్ కుమార్ మాట్లాడుతూ..”ఫైన్ విధిస్తే ఆ ఫైన్ కట్టడానికి పోలీసులు నిరాకరిస్తారు. పైగా కొన్నిసార్లు కొట్టేందుకు ప్రయత్నించారు. అందుకే నేను వారి చర్యలను ముందుగానే ఫోన్ లో వీడియో రికార్డ చేస్తాను. ఫైన్ కట్టక పోతే ఈ వీడియో వారి ఉన్నతాధికారులకు చూపిస్తామని చెబుతాను. కొంతమంది ఫైన్ చెల్లిస్తారు. కానీ కొంతమంది ఫైన్ నుంచి తప్పించుకోవడానికి ఒక రైల్వే కోచ్ నుంచి మరొక రైల్వే కోచ్ కు పారిపోతుంటారు. వీరంతా తాము ఏం చేసినా ఎవరూ పట్టించుకోరని భావిస్తుంటారు,” అని చెప్పారు.

దీపావళి, దసరా పండుగ సమయంలో ట్రైన్లలో రద్దీ ఎక్కువ ఉండడంతో చెకింగ్ డ్రైవ్ లు ఎక్కువగా చేపడతామని.. ప్రయాణికులకు ఇబ్బంది కలుగుకుండా ఉండేందుకు ఈ సడెన్ టికెట్ చెకింగ్ జరుగుతుందని ఒక సీనియర్ రైల్వే అధికారి అన్నారు.

Related News

Kashmir Marathon: 2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీ కొట్టిన బస్సు-12 మంది మృతి

Delhi Bomb Blast: ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన!

BJP Son Marry Pak Girl: రాజకీయాలను జయించిన ప్రేమ.. పాక్ యువతిని పెళ్లాడిన బిజేపీ నాయకుడి కుమారుడు..

Ratapani Wildlife Sanctuary: 7 పులులు, 14 చిరుత పులులు, 1 ఎలుగుబంటి మృతి.. ‘అంతా రైల్వే శాఖ తప్పిదమే’

Prakash Ambedkar: షరద్ పవార్ సిఎంగా ఉన్నప్పుడే మాఫియా డాన్‌తో దుబాయ్‌లో కలిశేవారు: అంబేడ్కర్ మనవడు

Big Stories

×