Rahulgandhi on NEET issue(Political news telugu): పార్లమెంట్ సమావేశాల తొలిరోజు నీట్ పేపర్ లీక్ వ్యవహారం లోక్‌సభను కుదిపే సింది. సోమవారం సభలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేత రాహుల్‌గాంధీ నీట్ వ్యవహారాన్ని లేవనెత్తారు. నీట్ లోనే కాదు అన్ని ప్రధాన పరీక్షల్లోనూ మన పరీక్షా విధానంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు.
ఈ క్రమంలో జోక్యం చేసుకున్న మంత్రి ధర్మేంద్రప్రధాన్, గడిచిన కాలంలో పేపర్లు లీక్ అయిన దాఖలాలు లేవని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. నీట్ వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందంటూ తప్పించుకునే ప్రయ త్నం చేశారు. కేవలం ఆరోపణలు చేయడంవల్ల అబద్దం నిజం కాదన్నారు. దేశంలో పరీక్షా విధానం చెత్త గా ఉందని ప్రతిపక్ష నేత చెప్పడం దారుణమన్నారు.
సమావేశాల నుంచి బయటకువచ్చిన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. నీట్ వ్యవహారంపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి ఉండాల్సిందన్నారు. సుప్రీంకోర్టు, ప్రధాని మోదీ గురించి మాట్లాడారంటూ తప్పించు కునే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై ఏం చేస్తున్నారో చెప్పలేకపోతున్నారన్నారు. నీట్ వ్యవహారం యువతకు చాలా ముఖ్యమైనదని, దీనిపై పార్లమెంట్‌లో చర్చకు కోరుతున్నామన్నారు. కానీ అధికార పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ అంశాన్ని సభలో తాము లేవనెత్తుతూనే ఉంటామన్నారు.
ALSO READ: మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయా?.. కొత్త బడ్జెట్‌పై ఆశలు..
విపక్షాల ఆలోచనను గమనించిన ప్రధాని నరేంద్రమోదీ, పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, ప్రతిపక్షాలకు హితవు పలికారు. 2029లో మరోసారి తలపడదామని, అప్పటివరకు రైతులు, మహిళలు, యవత జీవితాలను బాగు చేసేందుకు వినియోగించాలన్నారు.
సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ సమస్యలను చెప్పలేకపోతున్నారన్నారు ఆవేదన వ్యక్తంచేశారు ప్రధాని మోదీ. ప్రజలు తీర్పు ఇచ్చేశారని, వాటిని నుంచి బయటకు వచ్చి దేశం కోసం పని చేయాలన్నారు. మొత్తానికి నీట్ అంశంపై సైలెంట్ కావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపి స్తోందన్నమాట.
#WATCH | Congress MP and LoP in Lok Sabha Rahul Gandhi says "It is obvious to the whole country that there is a very serious problem in our examination system, not just in NEET but in all the major examinations. The minister (Dharmendra Pradhan) has blamed everybody except… pic.twitter.com/ccclExwRTI
— ANI (@ANI) July 22, 2024
#WATCH | Congress MP and LoP in Lok Sabha Rahul Gandhi says "As this (NEET) is a systematic issue, what exactly are you doing to fix this issue?
Education Minister Dharmendra Pradhan says "…A lie will not become truth just by shouting. The fact that the Leader of Opposition… pic.twitter.com/gbTXVoqytk
— ANI (@ANI) July 22, 2024