EPAPER

RahulGandhi comments: హిండెన్‌బర్గ్ తాజా రిపోర్టు, రాహుల్ రియాక్ట్, జేపీసీ వేయాల్సిందే..

RahulGandhi comments: హిండెన్‌బర్గ్ తాజా రిపోర్టు, రాహుల్ రియాక్ట్, జేపీసీ వేయాల్సిందే..

RahulGandhi comments: దేశంలో బీజేపీ ప్రభుత్వం క్రమంగా డౌన్‌ఫాల్ అవుతుందా? మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేదని కుండబద్దలు కొడుతున్న మోదీ సర్కార్, అదానీ వ్యవహారంలో ఉందుకు సైలెం ట్ అవుతోంది? జేపీఏ వేయడానికి ఎందుకు వెనుకాడుతోంది? తాజాగా హిండెన్‌బర్గ్ రిపోర్టు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయా? ఇవే ప్రశ్నలు బీజేపీ నేతలను వెంటాడుతోంది.


హిండెన్‌బర్గ్ కొత్త రిపోర్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తొలిసారి రియాక్ట్ అయ్యారు. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సెబీ (సెక్యూరిటీస్- ఎక్చ్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) సమగ్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఆరోపణలపై సెబీ చీఫ్ మాధబి పురి బచ్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.

మార్కెట్‌లో పెట్టబడుదారులకు భరోసా ఇచ్చేదెవరు? ప్రధాని నరేంద్రమోదీ, సెబీ ఛైర్‌పర్సన్, లేకా అదానీయా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు రాహుల్‌గాంధీ. హండెన్‌బర్గ్ తాజా ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ-జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు లేవనెత్తారాయన.


ALSO READ: ‘ఒక్క ముద్దు పెడితే సెలవు ఇప్పిస్తా’.. కాలేజీలో మహిళా టీచర్‌ను వేధించిన మేనేజర్!

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా పరిశీలిస్తుందా? జేపీసీ వేసేందుకు ఎందుకు ప్రధాని మోదీ ఎందు కు భయపడుతున్నారని ప్రశ్నించారు. దానివల్ల ఏం వెల్లడవుతుందని అన్నారు. హిండెనబర్గ్ కథనాలపై మొదటి నుంచి రాహుల్‌గాంధీ.. మోదీ సర్కార్‌పై ఫైట్ చేస్తున్నారు. అదానీ వ్యవహారంపై నిగ్గు తేల్చేందు కు జేపీసీ వేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్.

మోదీ సర్కార్ జేపీసీ విషయంలో వెనుకడుగు వేస్తోంది. గతేడాది అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది హిండెన్‌బర్గ్. అయినా మోదీ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఏకంగా సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్, ఆమె భర్తకు అదానీ గ్రూప్‌కు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో వాటాలున్నాయన్నది తాజా ఆరోపణ. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ సైలెంట్‌గా ఉంటే ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నమాట. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×