EPAPER

Rahul Navin ED Chief: ఈడీ చీఫ్‌గా రాహుల్ నవీన్ నియామకం.. కేజ్రీవాల్, హేమంత్ సొరేన్ కేసులు చూసేది ఈయనే!

Rahul Navin ED Chief: ఈడీ చీఫ్‌గా రాహుల్ నవీన్ నియామకం.. కేజ్రీవాల్, హేమంత్ సొరేన్ కేసులు చూసేది ఈయనే!

Rahul Navin ED Chief| దేశంలో ఆర్థిక నేరాలపై కొరడా ఝుళిపించే కేంద్ర విచారణ సంస్థ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ గా రాహుల్ నవీన్ ఐఆర్ఎస్ నియమితులయ్యారు. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ.. ఈడీ చీఫ్ గా రాహుల్ నవీన్ నియామక ఆదేశాలు బుధవారం ఆగస్టు 14 రాత్రి జారీ చేసింది. రాహుల్ నవీన్ ఇప్పటికే ఈడీ తాత్కాలిక చీఫ్ గా పనిచేస్తుండగా.. ఆయనకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించింది.


కేంద్రం జారీ చేసిన నియామక ఆదేశాల ప్రకారం.. 1993 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఇన్ కమ్ ట్యాక్స్ క్యాడర్ అధికారి అయిన రాహుల్ నవీన్ రెండేళ్ల వరకు ఈడీ చీఫ్ గా కొనసాగుతారు. నవీన్ ఈడీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఆయన పదవికాలం ప్రారంభమవుతుంది.

Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేసిన ప్రధాని మోదీ..


ఈడీ డైరెక్టర్ పదవి కేంద్ర ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ హోదాతో సమానం. రాహుల్ నవీన్ డిసెంబర్ 2023న అడిషనల్ సెక్రటరీ చేశారు. 57 ఏల్ల నవీన్, నవంబర్ 2019లో స్పెషల్ డైరెక్టర్ గా ఈడీ నియమితులయ్యారు. ఈడీ స్పెషల్ డైరెక్టర్ గా నవీన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి దేశంలోని ఆర్థిక నేరగాళ్లపై ప్రత్యేక దృష్టిసారించారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

కాన్పూర్ ఐఐటి నుంచి బి టెక్, ఎం టెక్ పూర్తి చేసిన రాహుల్ నవీన్, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో స్విన్ బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబిఏ పూర్తి చేశారు. అంతర్జాతీయ ట్యాక్ విధానంలో నైపుణ్యం ఉన్న రాహుల్ నవీన్ కు 30 ఏళ్ల పాటు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. బిహార్ కు చెందిన నవీన్ 2004-08 కాలంలో అంతర్జాతీయ పన్నుల అంశంలో వొడాఫోన్ కంపెనీ ఆర్థిక లావాదేవీలలో అవతవకలను గుర్తించారు.

సెప్టెంబర్ 15, 2023న ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తైన తరువాత రాహుల్ నవీన్ తాత్కాలిక ఈడీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు.

Also Read: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి

అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్ అరెస్టు
ఈడీ చీఫ్ గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రాకు సన్నిహితుడైన రాహుల్ నవీన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అరెస్టులలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

అలాగే సందేశ్ ఖలీ ఘటన తరువాత పశ్చిమ బెంగాల్ వెళ్లిన ఈడీ బృందంలో నవీన్ కూడా ఉన్నారు. అక్కడ పోలీసులకు నిర్బయంగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: జపాన్ రాజకీయాలు షేక్.. తన పార్టీసభ్యులు అవినీతికి పాల్పడ్డారని అంగీకరించిన ప్రధాని!

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×