Big Stories

Rahul Gandhi : తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం.. కేంద్రంలోనూ కాంగ్రెస్ దే గెలుపు : రాహుల్ గాంధీ

Rahul Gandhi : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చాయి. అక్కడ అధికారం దక్కడం ఆ పార్టీలో విశ్వాసాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఇదే విధంగా మరికొన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

న్యూయార్క్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ భారత్ లో రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అదే జోరు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని బీజేపీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -

బీజేపీని తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో నిరూపించామని రాహుల్ అన్నారు. కమలం పార్టీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని తెలిపారు. అయినా సరే కాంగ్రెస్‌ ఆ పార్టీని తుడిచిపెట్టేసిందన్నారు. తెలంగాణలోనూ అలాంటి ఫలితాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని గుర్తించడం కష్టమన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనుమరుగవుతోందన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించారన్నారు.

2024 ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తామని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. అందుకోసమే ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఓవైపు బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్‌ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News