EPAPER

Rahul’s first reaction after exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై రాహుల్ కామెంట్స్, అది మోదీ మీడియా పోల్..

Rahul’s first reaction after exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై రాహుల్ కామెంట్స్, అది మోదీ మీడియా పోల్..

Rahul’s first reaction after exit polls: దేశంలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయాయి. కొత్తగా ఎగ్జిట్ పోల్స్‌పై దుమారం రేగుతోంది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన ఛానెళ్లు ఎన్డీయేకు పట్టం కడుతూ అంచనాలను వెలువరించాయి. ఒకటో రెండో ఛానెళ్లు ఇండియా కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. ఇక కూటమి పనైపోయిందని భావించారు.


తాజాగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎల్పీ, పీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అగ్రనేత రాహుల్‌గాంధీ నేరుగా మాట్లాడారు. రాష్ట్రాల్లో పోలింగ్ శాతం, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు.

కౌంటింగ్ రోజు నేతలు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై మంతనాలు జరిపారు. చివరి రౌండ్ వరకు కౌంటింగ్ కేంద్రాన్ని విడిచి పెట్టవద్దని నేతలు సూచన చేశారు. సమావేశం అనంతరం రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ బయటకు వచ్చారు.


ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ గురించి మీడియా ప్రస్తావించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్‌గాంధీ, ఇదేమీ ఎగ్జిట్ పోల్ కాదని, మోదీ మీడియా పోల్‌గా వర్ణించారు. ఎగ్జిట్ పోల్‌ను ఫాంటసీ పోల్‌గా వర్ణించారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. సిద్దూ మూస్ వాలా పాటలోని 295 ఫిగర్‌ను ఓకే చేసుకోవాలన్నారు అగ్రనేత.

 

 

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×