EPAPER

Rahul Gandhi: దళితులపై ఆ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ… వైరలవుతున్న వీడియో

Rahul Gandhi: దళితులపై ఆ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ… వైరలవుతున్న వీడియో

Rahul Gandhi Visits Dalit Family: రాహుల్ గాంధీ.. ఈ పేరు ప్రస్తుతం రాజకీయాల్లో విరివిగా వినిపిస్తున్న పేరు. దేశంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ క్షణాల్లో వాలిపోతున్నారు రాహుల్ గాంధీ. వారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కరమయ్యే దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు అండగా నిలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. పార్లమెంటులో ప్రజల సమస్యలపై తన గొంతును వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించే విధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పార్లమెంటు సమావేశాలంటే రాహుల్ గాంధీ హవా అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇటు ప్రజల వద్దకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఓ బోనులో నిలబెట్టి సద్వివిమర్శలు చేస్తూ వణుకుపుట్టిస్తున్నారు.


Also Read: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అప్పుడప్పుడు పలు పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలోని క్యాబ్ లో ప్రయాణించి.. క్యాబ్ డ్రైవర్ల సమస్యలు ఏమిటి..? వారు పడుతున్న బాధలు..? అన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన భారీగా వైరలైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా కూడా మరో వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఓ దళితుడి ఇంట్లోకి వెళ్లి వారితోపాటు వంట చేశారు. వారి సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వారితో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సోమవారం మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన దళిత కమ్యూనిటీకి చెందిన అజయ్ తుకారాం సనాడే ఇంటికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం వెళ్లారు. అజయ్ కుటుంబంతోపాటు ఆ ఇంటిలో చాలా సేపు గడిపారు. వారి ఇంట్లో వారితోపాటు పలు వంటకాలు కూడా చేశారు. ఆ తరువాత ఆ కుటుంబంతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొన్న కుల వివక్ష గురించి, ఆహారం విషయంలో కూడా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులతోపాటు చాలా విషయాలను రాహుల్ గాంధీ తెలిపారు. దళితుల ఆహారపు అలవాట్లకు సంబంధించిన విషయాలపై డాక్యుమెంటేషన్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా దళిత వర్గానికి చెందిన ప్రముఖ రచయిత సాహు పటోల్ కూడా రాహుల్ గాంధీతో ఉన్నారు. ‘దళిత్ కిచెన్ ఆఫ్ మరట్వాడా’ అనే పుస్తకాన్ని సాహు పటోల్ ప్రస్తుతం వ్రాస్తున్నారు.

Also Read: మోదీ అలా చేస్తే.. బీజేపీ తరపున ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్ సవాల్

ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియా(ఎక్స్)లో షేర్ చేశారు. తాను వారితో మాట్లాడి తెలుసుకున్న విషయాల గురించి అందులో ప్రస్తావించారు. దళితులు ఏ విధంగా వివక్ష ఎదుర్కొంటారో.. వారు ఆ బాధపడుతారో తనకు తెలుసన్నారు. భవిష్యత్తులో ఇటువంటి వివక్ష లేకుండా ఫైట్ చేస్తామన్నారు. నెట్టింటా ఈ వీడియో ప్రజెంట్ తెగ వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాహుల్ నిజంగా లెజెండ్ అని అంటున్నారు.

Related News

RuPay in Maldives: మోదీతో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ.. ఇక అక్కడా ‘RuPay’ కార్డ్

Mumbai Metro Line 3: ముంబై మొదటి భూగర్భ మెట్రో లైన్ 3ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఛార్జీల వివరాలు ఇవే

Arvind Kejriwal: మోదీ అలా చేస్తే.. బీజేపీ తరపున ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్ సవాల్

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

×