EPAPER

Rahul Gandhi Contest from Raebareli: బరేలీ బరిలో రాహుల్.. నామినేషన్ దాఖలు..!

Rahul Gandhi Contest from Raebareli: బరేలీ బరిలో రాహుల్.. నామినేషన్ దాఖలు..!

Rahul Gandhi to contest from Raebareli: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయబరేలీ సీట్లపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. యువనేత అమేథి నుంచి కాకుండా ఈసారి రాయ్‌బరేలీ బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ ప్రకటన చేసింది. తొలుత రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఆమె డ్రాపయ్యారు. ఈ మార్పుల వెనుక అసలు కారణమేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు కాంగ్రెస్ అభిమానులను వెంటాడుతున్నాయి. అసలేం జరిగింది?


రాయ్‌బరేలీలో బీజేపీ తరపున దినేష్ ప్రతాప్‌సింగ్ బరిలో ఉన్నారు. గతంలో ఆయన, సోనియాగాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలని భావించిన తరుణంలో తెరపైకి రాహుల్‌గాంధీ వచ్చారు. దీంతో రాయ్‌బరేలీలో కాంగ్రెస్-బీజేపీల మధ్య ఫైట్ నువ్వానేనా అన్నరీతిలో జరగడం ఖాయమని అంటున్నారు. అమేథి నుంచి రాయబరేలీకి సోనియాగాంధీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది. దాంతో ఆ సీటును ఆమె కంటిన్యూ చేశారు. అయితే వయస్సు రీత్యా ఈసారి ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సూచన మేరకు రాహుల్ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారు.

మరోవైపు అమేథీ నుంచి రాహుల్‌పై పోటీ చేసేందుకు అన్ని అస్త్రాలను సిద్ధంచేశారు కేంద్రమంత్రి స్మృతిఇరానీ. నామినేషన్ మొదలు ఆ నియోజకవర్గంలో రోడ్ షోలతో చుట్టేస్తున్నారు. చివరకు స్మృతి ఇరానీ ఆశలు అడియాశలయ్యాయి. అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున కిషోరీ‌లాల్‌శర్మ బరిలోకి దిగుతున్నారు. కిషోరీ‌లాల్ శర్మ చాలాకాలంగా గాంధీ కుటుంబానికి విధేయుడు. రాయ్‌బరేలి నియోజకవర్గం లో ఆయన కీలక నేత కూడా. ఈ క్రమంలో శర్మకు అమేథి నుంచి పోటీ చేసే ఛాన్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది.


Also Read: వివాదంలో కర్ణాటక మంత్రి, ప్రజ్వల్… కృష్ణుడు మాదిరిగా,

కిషోరీ‌లాల్ శర్మ చాలాకాలంగా గాంధీ కుటుంబానికి విధేయుడు. అమేథీ, రాయ్‌బరేలి నియోజకవర్గాలకు కీలక నేత కూడా. శర్మ సొంతూరు పంజాబ్ కాగా, ఆ తర్వాత అమేథికి వలస వచ్చారు. 1983 నుంచి కాంగ్రెస్ నేతగా ఆయన కొనసాగుతున్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి విధేయుడు కూడా. రాజీవ్ మరణాంతరం అమేథీలో పార్టీ బాధ్యతలను చూసేవారు. 1999 తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి సోనియాగాంధీ దిగినప్పుడు, ఆమె గెలుపు వెనుక శర్మ తీవ్రంగా కృషి చేశారు. ఆ తర్వాత అమేథి నుంచి రాయ్‌బరేలీకి సోనియాగాంధీ మారారు. 2004లో రాహుల్‌గాంధీ అమేథి నుంచి లోక్‌సభ‌కు ఎన్నికయ్యారు. యువనేత గెలుపు వెనుక అన్నీ తానై వ్యవహరించారు శర్మ. ప్రస్తుతం కిషోరీ‌లాల్ శర్మ అమేథితోపాటు రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తున్నారు.

Rahul Gandhi Nomination from Raebareli in UP
Rahul Gandhi Nomination from Raebareli in UP

ఈ రెండు స్థానాలకు ఐదో విడత అంటే మే 20న ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో అమేథీ, రాయ్‌బరేలీ సీట్లపై నెలరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడింది. మధ్యాహ్నం 12గంటలకు రాహుల్, ఉదయం 10 గంటలకు కిషోరీలాల్‌శర్మ తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, ప్రియాంకగాంధీ కూడా హాజరయ్యారు.  ఇదిలావుండగా రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్‌లో అక్కడ ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగాయి. మొత్తానికి తొలిసారి రెండు చోట్ల నుంచి రాహుల్‌గాంధీ బరిలోకి దిగారన్నమాట.

Also Read:  Congress Puri Lok Sabha candidate drops: కాంగ్రెస్‌కు మరో షాక్, తప్పుకున్న అభ్యర్థి సుచరిత, ఎందుకంటే..

 

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×