Rahul Gandhi says ED raid: మోదీ సర్కార్‌పై మరో బాంబు పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ. తనను అష్టదిగ్భంధనం చేసేందుకు స్కెచ్ వేసినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తనపై ఈడీ దాడులు జరిగే ఛాన్స్ ఉందని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై ఎన్డీయే ప్రభుత్వం ఉలిక్కిపడింది.
తనపై సోదాలు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోందన్నారు రాహుల్‌గాంధీ. అందులో పని చేస్తున్న కొందరు వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. రీసెంట్‌గా లోక్‌సభలో రాహుల్ తన ప్రసంగంలో చక్రవ్యూహం గురించి మాట్లాడారు. ఆ ప్రసంగం నచ్చకపోవడంతో తనను టార్గెట్ చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కేవలం ఆరుగురు వ్యక్తులు దేశాన్ని పద్మవ్యూహంలోకి నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. మహాభారతంలోని యుద్ధం సమయం లో అభిమన్యుడి విషయాన్ని ప్రస్తావించారు. ఆ చక్రవ్యూహంలో ఆరుగురు ఉన్నారని గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా మరికొందరిపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం యువత, రైతులు, మహిళలు, చిన్నచిన్న వ్యాపారుల చుట్టూ అలాంటి ఉచ్చు పన్నుతున్నారని దుయ్యబట్టారు.
ALSO READ: నీట్ కేసు.. తొలి ఛార్జిషీట్‌లో 13 మంది.. కాకపోతే..
ముఖ్యంగా మోదీ సర్కార్ రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ఉద్దేశమని విమర్శలు గుప్పించారు రాహుల్‌గాంధీ. అయితే ప్రతిపక్ష నేత ఆరోపణలపై బీజేపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. అప్పటికే రాహుల్ మాటలు ప్రజల్లోకి వెళ్లిపోయారు.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో తనపై ఈడీ టార్గెట్ చేసిందన్నది రాహుల్ మాట. మరి ప్రతిపక్ష నేత ఆరోపణలపై మోదీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024