Big Stories

Rahul Gandhi: రాహుల్‌ ట్రావెల్స్!.. ‘జన్ కీ బాత్‌’తో జననాయక్

RAHUL TRAVELS

Rahul Gandhi: పాపులారిటీ పెరగాలని ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఏనాడూ ప్రయత్నించలేదు. రాహుల్ రాజకీయ జీవితాన్ని భారత్ జోడో యాత్ర చాలా వరకు మార్చేసింది. అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా పరిణామాలు మారిపోయాయి. ప్రధాని మోదీ రేడియోలో నెలకోసారి మన్ కీ బాత్ వినిపిస్తూ వస్తున్నారు. మొన్నామధ్యే అది వందో ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రోగ్రామ్ కు ధీటుగా జన్ కీ బాత్ వింటూ రాహుల్.. బీజేపీకి కౌంటర్లు వేస్తున్నారు.

- Advertisement -

శ్రద్ధగా వినడం కూడా ఓ కళే. ఎందుకంటే ఇత‌రులు చెబుతున్నది వినాలంటే చాలా స‌హ‌నం ఉండాలి. వారి మాట‌ల‌నే కాదు మాట‌ల వెనుక ఉన్న మ‌న‌సుని భావోద్వేగాల‌ను సైతం స్పష్టంగా తెలుసుకోవాలంటే శ్రద్ధగా వినాలి. ఇప్పుడు రాహుల్ పేదల మనసు బాధలను వింటున్నారు. మోదీ తన మనసులో మాట అందరికీ చెబుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం జన్ కీ బాత్ లో జనం కష్టాలను వింటున్నారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అదే జనంలో రాహుల్ గ్రాఫ్, పాపులారిటీ పెరిగేందుకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇటీవల బెంగళూరు ఎలక్షన్ ప్రచారం టైంలో సిటీ బస్సు ఎక్కి మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ టూ వీలర్ ఎక్కి మాట మాట కలుపుతూ ప్రయాణించారు. తాజాగా, లారీ ఎక్కి డ్రైవర్ల సాధకబాధలు తెలుసుకున్నారు.

- Advertisement -

రాహుల్ గాంధీ జననాయక్.. ఈ డైలాగ్ కు దేశంలో క్రేజ్ పెరుగుతోంది. ఎందుకంటే లేటెస్ట్ గా ఢిల్లీ నుంచి రాహుల్ ప్రయాణిస్తున్న టైంలో ఉన్నట్లుండి.. షెడ్యూల్ మార్చుకుని లారీలో ప్రయాణించారు. ఇది ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ SUVలలో తిరిగే వారికి రాత్రంతా కొన్ని గంటల పాటు కూర్చుని లారీ ప్రయాణం చేయడం అంటే మాటలు కాదు. గాలికి ఊడిపోయే చిన్న చిన్న పదవులు ఉన్న వారే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న రోజులివి. అలాంటిది గాంధీ నెహ్రూ వారసత్వం ఉన్నా కామన్ మ్యాన్ లా మారిపోతున్నారు రాహుల్.

దేశంలో 90 లక్షల మంది డ్రైవర్లు ఉంటారన్నది ఒక అంచనా. ఇప్పుడు లారీలో ప్రయాణించి డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడం ద్వారా చాలా వరకు వారికి కనెక్ట్ అయ్యారు రాహుల్. డ్రైవర్ల మన్‌ కీ బాత్‌ తెలుసుకునేందుకు రాహుల్‌ ఈ పని చేశారని కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్ లో తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ప్రజలకు మోదీ సర్కార్ కు దూరం పెరిగిపోయిందని, జనం మాటను జనం అవసరాన్ని పట్టించుకునే పరిస్థితులు లేవంటూ కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. జనానికి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోందని, అందుకే జనం బాధలు వినేందుకు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారని చెబుతున్నారు.

అటు, పార్లమెంటు సభ్యత్వం రద్దు కావడంతో ఆయనకు గతంలో ఇచ్చిన డిప్లమాటిక్‌ పాసుపోర్టును వెనక్కు తీసుకున్నారు. దీంతో ఆర్డినరీ పాసుపోర్టు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని రాహుల్ దరఖాస్తు చేసుకున్నారు. ఇలా, చాలా పరిణామాలతో రాహుల్ కామన్ మ్యాన్ అయ్యారు. జన్ కీ బాత్ వింటూ జన నాయక్ గా అడుగు ముందుకేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News