Big Stories

Rahul Gandhi: దేశ్ కీ నేత.. రాహుల్ గాంధీ 3.0

rahul gandhi

Rahul Gandhi Latest News(Today’s breaking news in India): ఇంట గెలవాలి. బయటా గెలవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే ఈక్వేషన్స్ ఫాలో అవుతున్నారు. జోడో యాత్రతో గ్రాఫ్ పెంచుకున్నారు. జనం మాట వింటున్నారు. కంప్లీట్ కామన్ మ్యాన్ లా మారిపోయారు. దేశ్ కీ నేతగా మారే క్రమంలో విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక సంస్థల సదస్సుల్లో పాల్గొంటున్నారు. NRIలపైనా ఫోకస్ పెంచుతున్నారు. మోదీపై విమర్శల విషయంలో రూట్ మార్చేశారు.

- Advertisement -

అధికారంలో ఉన్న వాళ్లు తప్పు చేస్తే విపక్షాలు ప్రశ్నించాలి. అదే పని రాహుల్ గాంధీ చేస్తూ వస్తున్నారు. రాఫెల్ డీల్ ఇష్యూ అయినా… ఇప్పుడు అదానీ విషయంలోనైనా చాలా వరకు మోదీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే జనానికి ఇవి కనెక్ట్ అవలేకపోయాయి. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ – మోదీ సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేయని రోజంటూ లేదు. లోక్ సభలో ఏకంగా మోదీ అదానీ ఫోటో చూపి మరీ అడిగారు. అదానీ హిండెన్ బర్గ్ ఇష్యూపై జేపీసీ వేయాలన్న డిమాండ్లు చేశారు. అయితే వాటికి బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అలాగే జనం నుంచి కూడా పెద్దగా సపోర్ట్ దొరకలేదు. దీంతో రాహుల్ కంప్లీట్ గా రూట్ మార్చేశారు. మోదీని విమర్శిస్తూ వెళ్తే ఇక ఉపయోగం లేదని, జనం మనసులను ప్రేమతో గెలవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో అసలు అదానీ ఇష్యూ లేదు.. జాతీయ అంశాలపై ప్రస్తావన లేదు. మోదీపై పెద్దగా విమర్శలు లేవు. అంతా కర్ణాటక సమస్యలపైనే ఫోకస్ పెట్టి.. రాష్ట్ర సమస్యల చుట్టూనే ఎన్నికల ప్రచారాలు చేశారు. సైలెంట్ గా, సింపుల్ గా సక్సెస్ సాధించారు.

- Advertisement -

మారుతున్న రాజకీయ సమీకరణాలతో వ్యూహాలు మార్చుకోవడం ఎప్పటికప్పుడు అవసరమే. అదే పని ఇప్పుడు రాహుల్ చేస్తున్నారు. దేశం దృష్టిలో ఉండడంతో పాటు ప్రపంచ దేశాల దృష్టిలో ఉండడం కూడా ముఖ్యమే. అందుకే సార్వత్రిక ఎన్నికల ముందు కీలక స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు రాహుల్. అక్కడ జూన్ 4న 5 వేల మంది NRIలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలో పాల్గొంటారు రాహుల్. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కీలకంగా మారుతోంది. ఎందుకంటే జూన్ 22న ప్రధాని మోదీ USA టూర్ ఉంది. అంతకు ముందే రాహుల్ షెడ్యూల్ డిసైడ్ అవడం చర్చనీయాంశమైంది. NRIల విషయంలో తమ స్టాండ్ ను చెప్పేందుకు ఈ టూర్లను అటు రాహుల్, ఇటు మోదీ ఉపయోగించుకోనున్నారు. దీంతో భారత్ బయట పొలిటికల్ వార్ ఫేర్ నడవనుంది.

రాహుల్ తన పర్యటనలో వాషింగ్టన్, కాలిఫోర్నియాలోనూ పర్యటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రాహుల్ యూఎస్ టూర్ లో అక్కడి రాజకీయ నాయకులు… వ్యాపారవేత్తలతో మీటింగ్ లలో పాల్గొననున్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గ్రాఫ్ పెరిగిందని ఇప్పటికే చాలా సర్వేలు తేల్చాయి. మరోవైపు కర్ణాటకలో భారీ విజయం తర్వాత అమెరికా పర్యటనకు వెళ్తుండడం ఆసక్తికర పరిణామంగా మారింది. గతంలో లండన్ పర్యటన తర్వాత భారత్ వచ్చిన రాహుల్ ను బీజేపీ కార్నర్ చేసింది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందని, ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయంటూ కామెంట్ చేశారు. రాహుల్ బయటి దేశాలకు వెళ్లి భారత్ ప్రతిష్ఠ తగ్గించేలా మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలంటూ అప్పట్లో డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. అయితే తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదంటూ రాహుల్ గాంధీ కౌంటర్లు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటా బయటా సత్తా చాటేలా రాహుల్ వ్యూహాలు ఉంటున్నాయి.

మొన్నటి వరకు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం అంటే చాలా విపక్ష పార్టీలు విముఖత వ్యక్తం చేసిన పరిస్థితి. అంతెందుకు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను పక్కన పెట్టాలని కొన్ని విపక్షాలు డిసైడ్ కూడా అయ్యాయి. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో హస్తం పార్టీ హవా పెరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా సత్తా చాటితే వచ్చే మే నాటికి కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేసేలా విపక్షాలను డిమాండ్ చేసే స్థాయికి వెళ్తుంది. ఇలా ఒకదానికి మించి మరో వ్యూహంతో రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో సర్వేల్లోనూ గ్రాఫ్ పెరిగిపోయింది. అంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది.

కాంగ్రెస్ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. నేతలు ఎవరికి వారే కామెంట్లు చేస్తుంటారు. అయితే రాహుల్ కీ రోల్ పోషించడం మొదలు పెట్టాక.. పార్టీని లైన్ లోకి తీసుకొస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇద్దరు ముగ్గురు ఎమర్జింగ్ లీడర్స్ ఉండడంతో అధికారాల విషయంలో సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిని పరిష్కరిస్తూ పార్టీలో ట్రబుల్ షూటర్ గా మారారు. గతంలో ఛత్తీస్ గఢ్ లో CM భూపేష్ బఘేల్, ప్రస్తుత ఛత్తీస్ గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో మధ్య విబేధాలను పరిష్కరించగలిగారు. అటు కర్ణాటకలో సీఎం ఎవరు అన్న చర్చ జరిగినప్పుడు చర్చల ద్వారా సమస్యకు దారి చూపారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లను పిలిచి మాట్లాడి చర్చించి ఒప్పించారు. డీకే చాలా ఎమోషనల్ గా కనిపించినా సరే ఆయనను మ్యాజిక్ చేసి మెప్పించడంలో రాహుల్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఇష్యూ నడుస్తోంది. ఆ స్టోరీకి ముగింపు పలికే పనిలో ఉన్నారు రాహుల్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News